వన్ సినిమాతో ఒక్కసారిగా అందర్నీ అట్రాక్ట్ చేసింది కృతీ సనన్! అయితే, ఈ ఢిల్లీ బ్యూటీ గ్లామర్ వాల్డ్ కి కొత్తేం కాదు. ఎన్నో ఫేమస్ కమర్షియల్ బ్రాండ్స్ కి కృతీ మోడలింగ్ చేసింది. చాలా యాడ్స్ లో కృతీ తన ఆకృతితో పిచ్చెక్కించింది. అలా ఛమక్కుముంటూనే సుకుమార్ దృష్టిలో పడి... మహేష్ హీరోయిన్ అయిపోయింది.... ఈ సుకుమారి! వన్ వర్కవుట్ కాకపోయినా కృతీ క్రేజ్ మాత్రం టాలీవుడ్లో బాగానే వర్కవుట్ అయింది. ఆమె గురించి మీడియా ఏదో ఒకటి రాస్తూ, మాట్లాడుతూనే వుంది. అటు కొందరు హీరోస్ అండ్ డైరెక్టర్స్ కూడా కృతీని తమ సినిమాల్లో తీసుకునేందుకు ఉత్సాహంగా వున్నారు. బట్ ఇంత వరకూ ఈ సన్నని అందాల సనోన్ మాత్రం సెకండ్ మూవీ సైన్ చేయలేదు!కారణం.... బాలీవుడ్లో ఆమె తొలి సినిమా రిలీజ్ కి రెడీ అవ్వటమే! ఆ సినిమానే... హీరోపంతి! హిందీలో జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ కు జోడీగా హీరోపంతి సినిమాలో నటించింది కృతీ. ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా. కాకపోతే... లిప్ లాకింగ్ లో మాత్రం ఇద్దరూ మంచి సీనియర్ స్మూచర్స్ లాగే మెప్పించారు. బట్... ఎంగిలి పడాల్సినంత పడిపోయి... ఇప్పుడు ఓ బాంబ్ పేల్చింది మన వన్ భామ! దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఏంటి అంటే.... సినిమా కోసం హీరో టైగర్ ష్రాఫ్ తో తాను చేసిన లిప్ లాక్ మొట్ట మొదటిదట! నోనో.... మీరు అనుకుంటున్నట్టు కృతీకి ఈ ముద్దు కేవలం వెండితెర మీదే కాదు... నిజ జీవితంలోనూ తొలి ముద్దట! ఇప్పుడు అర్థమైందా... హీరోపంతిలో హీరోయిన్ ఇచ్చిన రీల్ కిస్సులోని రియల్ యాంగిల్! రీసెంట్ గా కరన్ జోహర్, కాఫీ విత్ కరన్ షోలో... సల్మాన్ తానింక వర్జిన్ అన్నాడు! అఫ్ కోర్స్, ఈ ముదురు బ్రహ్మచారి మాటని అందరూ లైట్ గానే తీసుకున్నారు! ఇప్పుడు కృతీ సనోన్ తొలి చుంబనం డైలాగ్ కూడా అలాగే వుంది! మోడలింగ్ లో వుంటూ... ముంబై , ఢిల్లీ లైఫ్ స్టైల్ పాటించే కృతీ... కెమెరా ముందు టైగర్ ని కిస్ చేసేదాకా ఎవ్వర్నీ ముద్దాడలేదనటం.... కొంచెం ఓవరే! కాదంటారా?
 
Top