నాగార్జున ముద్దుల కొడుకు అఖిల్ తన తాతయ్య అక్కినేని నాగేశ్వర రావు జీవించి
ఉన్నారు అంటు తన ట్విటర్ లో మెసేజ్ పెట్టి సంచలనం సృస్టించాడు. గత జనవరిలో
మన మధ్య నుండి వెళ్ళిపోయిన అక్కినేని జీవించి ఉండటం ఎలా సాధ్యం అన్న
ప్రశ్న ఎవరికైనా వస్తుంది.
అక్కినేని మల్టీస్టారర్ మూవీ ‘మనం' చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధం
అవుతున్న నేపథ్యంలో నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ట్విట్టర్ ద్వారా తన
అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘మనం చిత్రం ఈ నెల 23న విడుదల అవుతుండటంపై ఎంతో
ఎగ్జైట్మెంటుగా ఉంది.
మనం చిత్రంలో తాతయ్య బ్రతికే ఉన్నారు. ఈ నెల 23 తర్వాత నుండి లాంగ్ జాయ్
రైడ్ ఉంటుందని భావిస్తున్నాను' అంటూ అఖిల్ ట్వీట్ చేసాడు. అక్కినేనికి
ఘనమైన వీడ్కోలుగా నాగార్జున రూపొందించిన ‘మనం’ విడుదల తేదీ దగ్గర పడుతున్న
కొద్దీ సినిమా ప్రమోషన్లు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ‘మనం'
చిత్రంలోని ‘పియో పియోరే' సాంగును విడుదల చేసి మరో కొత్త సంచలనం
సృస్టించాడు నాగ్.
ఈ నెలలో ఎన్నికల ఫలితాలు తరువాత విడుదల అవుతున్న పెద్ద సినిమా ‘మనం’
ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఈ
సినిమాకు పోటీగా విడుదల అవుతున్న మరే సినిమాలు లేకపోవడంతో ‘మనం’ అక్కినేని
వారి ఇంట కాసులు కురిపించడం ఖాయం అని అంటున్నారు.