ఆ మధ్య వచ్చిన అష్టాచమ్మ సినిమా గుర్తుందా? దాంట్లో హీరోయిన్ స్వాతి మహేష్ బాబు వీరాభిమానిగా కనిపిస్తుంది? నాట్ ఓన్లీ దట్.... మహేష్ అనే పేరున్న కుర్రాడ్నే పెళ్లాడుతానని పట్టుబడుతుంది! సో... సినిమా సక్సెస్ కి ఓ విధంగా ప్రిన్స్ మహేష్ కూడా కారణం అయ్యాడని చెప్పొచ్చు! అయితే, మహేష్ బాబు ఇప్పుడు మరో సినిమాకి హైలైట్ గా మారబోతున్నాడు! అలాగని సూపర్ స్టార్ ఆ సినిమాలో నటించడు కూడా! జస్ట్ ఆయన బొమ్మ యాక్ట్ చేస్తుంది! దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మహేష్ బాబు యానిమేటెడ్ క్యారెక్టర్ అవ్వబోతున్నాడు. అవును, ప్రిన్స్ ఓ సినిమాలో యానిమేట్ చేసిన క్యారెక్టర్ గా కనిపిస్తాడు. అంతే కాదు.... ఆ క్యారెక్టర్ ని విలన్స్ కిడ్నాప్ కూడా చేస్తారు. అందుకే, సూపర్ స్టార్ కిడ్నాప్ అని ఆ సినిమాకి టైటిల్ పెట్టారు.... మొత్తానికి నేరుగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో... వన్ నేనొక్కడినే అన్న మహేష్ తో సినిమా చేయకుండానే... దర్శకనిర్మాతలు సూపర్ స్టార్ ని తమ హైలైట్స్ లో చేర్చేసుకున్నారు. సూపర్ స్టార్ కిడ్నాప్ అనే సినిమా పోస్టర్స్ బయటకి రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. మహేష్ బాబుని తమ పబ్లిసిటీలో యూజ్ చేసేసుకుంటున్న ఈ సినిమాకి డైరెక్టర్ సుశాంత్ రెడ్డి. మొదటి సినిమానే అయిన్పటికీ సూపర్ స్టార్ కిడ్నాప్ అంటూ సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్స్ పర్ట్స్ ప్రిన్స్ బొమ్మకు ప్రాణం పోసే పనిలో పడ్డారట! చూడాలి మరి... టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్... గ్రాఫిక్స్ లో ఎలా వుంటాడో!? సూపర్ స్టార్ కిడ్నాప్ సినిమా సెన్సార్ అయిపోయి బయటకు రావాలంటే ఒక ఇబ్బంది వుంది. ఈ సినిమా మేకర్స్ ప్రిన్స్ నుంచి నో అబ్జెక్షన్ స్టేట్ మెంట్ తీసుకురావాలి. లేదంటే విడుదల కావటం కష్టమే. మరి సదరు... అప్ కమింగ్ క్రియేటివ్ పీపుల్ మహేష్ ని కన్విన్స్ చేయగలుగుతారా? వేచి చూద్దాం... బట్ త్వరలో విక్రమ సింహగా మన ముందుకు వస్తోన్న రజినీకాంత్ ఆల్రెడీ గ్రాఫిక్ ఇమేజ్ గా మారిపోయాడు! ఆయన తరువాత వెండితెరపైకి ఇండైరెక్ట్ గా రానున్న మహేష్ బాబు ఎలా వుండనున్నాడో?
 
Top