ప్రస్తుతం సినిమాలు తీయకపోయినా ఏదో ఒక విషయం పై సంచలనంగా మాట్లాడుతూ ఎప్పుడు సంచలనాలకు కేంద్రబిందువుగా ఉంటారు దాసరి. ప్రతి ఏడాది దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహిస్తూ, పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ యేడాది కూడా వినూత్న రీతిలో దాసరి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో దాసరి జన్మదిన ఉత్సవ కమిటి ఆయన పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 4న వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. షార్ట్‌ ఫిలింస్‌ తో మంచి పేరు తెచ్చుకున్న ఆరుగురికి దాసరి ప్రతిభా పురస్కారాలను అందించ బోతున్నారు. దాసరి పేద విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లతో పాటు జాతీయ పురస్కారాన్ని అందుకున్నజర్నలిస్ట్ నందగోపాల్‌కి, జాతీయ స్థాయి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా మూడు అవార్డులను అందుకున్న 'నా బంగారు తల్లి' చిత్ర దర్శక నిర్మాతలకు ఆదర్శ పూర్వక సత్కారాలను అందజేయనున్నారు. అదే విధంగా తెలుగులో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థినీవిద్యార్థులకు దాసరి విద్యా పురస్కారాల పేరిట సత్కరించనున్నారు.. ఈ కార్యక్రమాన్ని రేపు 4వ తేదిదాసరి పుట్టిన రోజు సందర్భంగా సాయంత్రం రవీందభ్రారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించ బోతున్నారు. తెలుగు సినిమా రంగం పైనా రాజకీయాల పైనా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దాసరి రేపు ఎటువంటి మాటల తూటాలు వదులుతారో అనే ఆసక్తి మీడియాలో ఉంది.
 
Top