మెగా హీరో అల్లు అర్జున్ అంటే టాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్స్ కు విపరీతమైన
క్రేజ్. ఎందుకంటే ఈ మెగా హీరో ఎదుగుతున్న అప్ కమింగ్ స్టార్.
ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ కు ఈ అప్ కమింగ్ స్టార్ సరసన అవకాశం వచ్చిందంటే
చాలు, ఫుల్ జోష్ అన్నమాట. అంతే కాకుండా టాప్ హీరోయిన్స్ కి సైతం
అల్లుశిరీష్ అంటే ఓ ప్రత్యేక అభిమానమే. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ మెగా
హీరోకు ఓ డేరింగ్ హీరోయిన్ ఝలక్ ఇచ్చింది. దీంతో అల్లుఅర్జున్
అవాక్కయ్యాడంట. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్
ప్రత్యేకంగా మీకు అందిస్తుంది.
సెలక్టివ్ గా సినిమాలు చేసే నిత్యామీనన్ 'ఇష్క్', 'గుండెజారీ
గల్లంతయ్యిందే' వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంది. ఇక ఆ
తర్వాత నారా రోహిత్ తో చేసిన 'ఒక్కడినే' పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం తెలుగులో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. తాజా నిత్యా మీనన్ ఓ క్రేజీ
ప్రాజెక్టుకు ఒప్పుకుందని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం 'అల్లు శిరీష్'
నటించిన 'కొత్తజంట' మే 1న విడుదల కాబోతోంది. ఆ సినిమా తర్వాత 'ప్రేమ ఇష్
కాదల్' చిత్ర దర్శకుడు పవన్ సాదినేనితో శిరీష్ హీరోగా ఓ సినిమా సెట్స్ పైకి
వెళ్ల బోతోంది.
ఈ సినిమాలోనే నిత్యా మీనన్ హీరోయిన్ గా ఓకే చెప్పిందట. అయితే స్క్రిప్ట్
నచ్చితే తప్ప ఏ సినిమాకూ ఓకే చెప్పని నిత్య ఎప్పటిలాగే ఆ రొటిన్ డైలాగ్
విసిరింది. అంతే కాకుండా "అల్లుశిరీష్ తో ఆడిషన్స్ జరిపించండి. ఇద్దరి
కాంబినేషన్ బాగుందనిపిస్తేనే మూవీను చేస్తాను" అని అందట. దీంతో విషయం
తెలుసుకున్న అల్లుఅర్జున్ నోరువెళ్ళబోట్టాడని టాలీవుడ్ టాక్.