సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు కులపరమైన సమీకరణాల కోసం పవన్ కు యువతరంలో ఉన్న క్రేజ్ ను ఓట్ల రూపంలో మార్చుకోవడానికి మోడీతో కలిసి తాను పాల్గొన్న సభల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకాశానికి ఎత్తేస్తూ పొగడడం చూసి బాలయ్య అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి.  పవన్‌కల్యాణ్‌ ను స్థాయికి మించి చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటూ ఉండటమే కాకుండా ఆ స్థాయిలో బాలయ్యకు విలువ ఇవ్వడం లేదు సరికదా కనీసం తన ఉపన్యాసాలలో ఎదో ఒక సందర్భంలో బాలకృష్ణ పేరును కూడ చంద్రబాబు పట్టించుకోకపోవడం కూడా అభిమానులకు చిరాకు తెప్పిస్తోంది అని అంటున్నారు .  కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీ అని దేశం అంతా ప్రచారం జరుగుతున్న సమయంలో.. నరేంద్రమోడీ పాల్గొంటున్న సభల్లో ఆయన సరసన కూర్చోవడం అనేది ఎవ్వరైనా సరే గౌరవంగా భావిస్తారు అని బాలయ్య అభిమానుల వాదన. అలాంటి నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ కు మాత్రం పెద్దపీట వేసి వేదిక మీద కూర్చోబెట్టడం,సీమాంధ్ర ప్రాంతంలో అయిదు మోడీ సభలు జరిగితే వాటిలో ఒక్కదానికి కూడా బాలయ్యను ఆహ్వానించకపోవడం నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఎన్నికలు కాక ముందునుంచే బాలకృష్ణను సైడ్ లైన్లో పెట్టడo బాలయ్య అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది. గతంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి బాలకృష్ణకు ప్రత్యేకంగా ఆహ్వానం అందినప్పుడు వెళ్లడానికి అంగీకరించని చంద్రబాబు అదే మోడీ తో చట్టాపట్టాలు వేసుకుని కలిసి తిరుగుతూ మోడీ భజనను చేస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉండటమే కాకుండా మరి ఆనాడు బాలయ్యను మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళ కుండా ఎందుకు చంద్రబాబు ఆపాడు అంటు చంద్రబాబు వన్ సైడ్ పాలసీ పై నందమూరి అభిమానులు గరం గరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
Top