సామాన్యంగా హీరోయిన్స్ హీరోలతో డేటింగ్ చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. కానీ ‘కొత్త జంట’ హీరోయిన్ రేజీనా నిన్న బంజారాహిల్స్ లోని ఒక మల్టీఫ్లక్స్ లో చేసిన హడావిడి టాలీవుడ్ టాక్ ఆఫ్ ది డేగా మారింది. నిన్న ‘కొత్త జంట’ సినిమాను ప్రేక్షకులతో కలిసి చుసిన రేజీనా ప్రేక్షకులందరితో కలివిడిగా మాట్లాడటమే కాకుండా తన నటన పై ప్రేక్షకుల అభిప్రాయాలను వరుస పెట్టి అందర్నీ పేరుపేరునా అడిగి తెలుసుకోవడం సంచలనంగా మారింది. సామాన్యంగా సినిమా పూర్తి కాగానే ప్రేక్షకులకు అందకుండా పారిపోయే హీరోయిన్స్ ను చూసిన భాగ్యనగర వాసులు రేజీనా ప్రవర్తనకు షాక్ అయ్యారు. హీరోయిన్ రేజీనాతో ప్రేక్షకులు వరుస పెట్టి ఫోటోలు తీయించుకుంటున్నా కాదనకుండా ఆమె ఫోటోలకు పోజులు ఇవ్వడం అందర్నీ ఆకర్షించింది. దీనితో కొత్త జంట సినిమా చూసి ఉసూరుమంటూ బయటకు వచ్చిన ప్రేక్షకులకు రేజీనా ఒక టానిక్ లా పనిచేసింది అని అంటున్నారు. హీరో అల్లు శిరీష్ నిరాశ పరిచినా, దర్శకుడిగా మారుతీ ఫెయిల్ అయినా రేజీనా అందంతో ‘కొత్త జంట’ ను నిలపెడుతుందని అనే టాక్ వినపడుతోంది. అల్లు శిరీష్ మరో అరడజను సినిమాలు చేసినా ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ను ఆకర్షించడం కష్టం అనే మాటలు వినిపిస్తున్న నేపధ్యంలో రేజీనా క్రేజ్ మన యంగ్ హీరోలలో విపరీతంగా పెరిగిపోతోంది.
 
Top