క్యూట్ హీరోయిన్ సమంత టాలీవుడ్ నిర్మాతలకే కాదు ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు కూడ ఒక మహారాణి. ఆమె అడిగితే కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉంటే ఆమెతో నటించడానికి మన టాప్ హీరోలంతా రెడీగా ఉంటారు. అటువంటి సమంతకు టాలీవుడ్ పై కోపం వచ్చి కోలీవుడ్ ను చుట్టేస్తోంది. అక్కడ సినిమాలలో నటిస్తున్నా కానీ తమిళనాట ఇంకా సక్సెస్‌ కాలేదనే వెలితి సమంతని వెంటాడుతోంది. ఎలాగైనా సొంత రాష్ట్రంలో తన సత్తా చూపించాలని చూస్తున్న సమంతకి అదృష్టం కొద్దీ స్టార్‌ హీరో సూర్యతో అంజాన్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీనిని ఎలాగైనా వాడేసుకుని తమిళనాడులో కూడా స్టార్‌ అయిపోవాలని చూస్తోంది సమంత. ఇంతకుముందు మామూలుగా కనిపిస్తే అక్కడి జనం తనని అంతగా పట్టించుకోలేదని సమంత తన పద్ధతినే మార్చేసుకుంది అని అనిపిస్తోంది..చక్కగా  పొందికగా కనిపించే సమంత ఈ చిత్రంలో మాత్రం అచ్చమైన నాటు అమ్మాయిలా బట్టలిప్పుకుని తిరుగుతూ కనిపిస్తుంది. ఆమె పొట్టి నిక్కరు బటన్స్‌ ఊడిన చొక్కా స్టిల్స్‌ వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సూర్య చాలా స్టయిలిష్‌గ కనిపిస్తోంటే సమంత అతని పక్కన సెకండ్ బి గ్రేడ్ హీరోయిన్ లా ఇలా కనిపించడం సమంత అభిమానులను షాక్ కు గురిచేయడమే కాకుండా అవకాశాల కోసం సమంత ఇంత దిగజారి పోవాలా అనే స్థితిలో సమంత ప్రస్తుత ప్రవర్తన ఉంది అంటూ సెటైర్లు పడుతున్నాయి.  
 
Top