కమలహాసన్ కుమార్తె శ్రుతిహాసన్ ఏకంగా తన తండ్రికే షాక్ ఇవ్వడం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. గజిబిజి షెడ్యూల్స్‌తో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో వరస పెట్టి సినిమాలు ఒప్పేసుకుంటూ బిజీబిజీగా వున్న శృతి హాసన్ ఇప్పుడు తన సినిమా డేట్లు అడ్జస్ట్ చేసుకోలేక జుట్టుపీక్కుంటోంది అని టాక్.. ఈ టెన్షన్‌లోనే తన తండ్రి కమల్ హాసన్‌కి కూతురుగా కనిపించే ఛాన్స్‌ని కూడ కోల్పోయింది శ్రుతి.  కమల్ హాసన్ లేటెస్ట్ తమిళ్ మూవీ 'ఉత్తమ విలన్'లో ఆయనకు కూతురి పాత్రలో నటించే ఆఫర్ ఇచ్చాడు దర్శకుడు రమేష్ అరవింద్. అటు తమ అభిమాన కథానాయకుడు కమల్, ఆయన కూతురు శృతి హాసన్ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో తండ్రీ కూతుళ్ల పాత్రలో కనిపిస్తున్నారని తెలిసి కమల్ ఫ్యాన్స్ తెగ ఆనంద పడిపోయారు.  అయితే ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాలతో బిజీబిజీగా వున్న శృతికి ఈ ఆఫర్‌ని వదులుకో వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుకోని ఈ అవకాశాన్ని మిస్ అయినందుకు శ్రుతి కూడ చాల బాధ పడుతోందట. ఇక విధిలేని పరిస్థుతులలో దర్శకుడు రమేష్ అరవింద్ సినిమాలో కమల్ కూతురుగా  కనిపించే ఛాన్స్ కోల్పోతున్నానని ఆమె కూడా ఫీలవుతోందట. తమిళంలోనే తెరకెక్కిన 'పూ' మూవీ ఫేమ్ పార్వతిని ఈ పాత్రకోసం ఎంపిక చేసారని టాక్. అయితే శ్రుతి కమల్ సినిమాను వదులుకోవడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి అంటు అప్పుడే కోలీవుడ్ మీడియా వార్తలు రాయడం మొదలు పెట్టింది.
 
Top