తమిళ హీరో అజిత్ కి ఈ మధ్య బాగానే కలిసి వస్తుంది. 2013 లో తీసిన సినిమాలుఅన్ని దాదాపు బంబర్ హిట్ గానే నిలిచాయి. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు అజిత్ ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభం అయ్యాయి. అజిత్ సరసన అందాల తారలు అనుష్క, త్రిష నటిస్తున్నారు. ఐతే ఓ మూడు రోజుల పాటు అజిత్ ,అనుష్క లపై బెడ్ రూం సన్నివేశాలు చిత్రీకరించారట! ఆ సీన్స్ తీస్తున్న సమయంలో యూనిట్ సభ్యులను ఎవరినీ ఆ పరిసర ప్రాంతాలలోకి రానివ్వలేదట. ఈ సన్నివేశాలకు కేవలం హీరో అజిత్, అనుష్క,దర్శకుడు, కెమెరామాన్ తప్ప ఎవరిని ఎంటర్ కానవ్వలేదట. ఐతే ఈ బెడ్ రూమ్ సీన్లు మూడు రోజులు ఏకబిగిన చిత్రీకరించడంతో ఇక ఎన్నిహాట్ హాట్ సీన్లు ఎన్ని లిప్ లాక్ సీన్లు ఉన్నాయో అని చిత్ర యూనిట్ గుస గుసలాడుకున్నారట. అంతేనా ఈ గుస గుసలు ఆ నోటా ఈ నోటా మీడియా కి కూడా పొక్కడంతో బెడ్ రూమ్ సీన్లు మరీ అంత ఘాటుగా ఉన్నాయోమో అని అందుకే చిత్ర యూనిట్ సభ్యులను ఎవరినీ దరిదాపుల్లో కి రానివ్వలేదని అంటున్నారు. పోనీలే అనుష్కకు తెలుగులో బాహుబలి, రుద్రమదేవి సినిమాలలో నటించడం వల్ల గ్లామర్ కి ఏమాత్రం చోటు ఇవ్వక పోవడం ఆ కరువు ఈ సినిమాతోనైనా తీరిందని పలువురు సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఈ సినిమాలోనై అమ్మడు తన వంపు సొంపులతో సినీ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.
 
Top