ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆశ్చర్యకరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. హీరో
అజిత్ ‘మంగాత్తా’ ‘ఆరంభం’, ‘వీరం’ చిత్రాల విజయంతో మంచి జోష్‌లో ఉన్న
నేపధ్యంలో నిన్న గురువారం పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు. ఈ స్టార్
హీరో తాజాగా గౌతమ్ మీనన్ దర్శత్వంలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.
‘ఆరంభం’ ఫేమ్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో అజిత్ సరసన అనుష్క
హీరోయిన్‌గా నటిస్తోంది అన్న విషయం కూడ అందరికి తెలిసిందే. మరో హీరోయిన్‌గా
త్రిష ఓకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర
షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తొలుత అజిత్ నటించే యాక్షన్ సన్నివేశాలను
చిత్రీకరించారు.
తాజాగా అజిత్, అనుష్క మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ
సన్నివేశాల చిత్రీకరణలో మూడు రోజులపాటు యూనిట్‌ను దూరంగా పెట్టి
చిత్రీకరించినట్టు సమాచారం. దర్శకుడు హీరో హీరోయిన్ కెమెరామెన్ మినహా
ఎవరినీ షూటింగ్ దరిదాపులకు రానియలేదట.
ఆ మూడు రోజులు యూనిట్‌కు పనిచేయకుండానే జీతం చెల్లించినట్టు తెలిసింది.
ఇంతకీ బేడ్ రూమ్ సన్నివేశాలలో అంత్యత రహస్యంగా చిత్రీకరించింది అజిత్,
అనుష్క మధ్య లిప్‌లాక్ సన్నివేశాలా? అంటు కోలీవుడ్ మీడియా గాసిప్స్ మొదలు
పెట్టింది. ఈ వార్తలే నిజం అయితే లిప్ లాక్ సీన్స్ లో నటిస్తున్న
హీరోయిన్స్ జాబితాలో అనుష్క కూడ చేరిపోయినట్లే లెక్క.