బాలీవుడ్ బ్యూటీ ఎవలీన్ శర్మ తన సొంత దేశం జర్మనీలో కూడ ఆకతాయిల వేధింపుకు గురైయ్యాను అని ప్రకటించడం సంచలనంగా మారింది.. ఇటీవల తన ఫ్యామిలీని కలిసేందుకు జర్మనీలోని ఫ్రంక్‌ఫర్ట్ పట్టణానికి వెళ్లిన ఎవలీన్ శర్మను అక్కడి కొందరు ఆకతాయి కుర్రాళ్లు వేధింపులకు గురి చేసారట. వారంతా కూడ ఇండియాకు చెందిన వారే అని ఈ బ్యూటీ చెపుతోంది. ఈ సంఘటన తనను ఆశ్చర్యానికి, షాక్‌కు గురి చేసిందని ఎవలీన్ శర్మ చెప్పుకొచ్చింది. ‘నా జీవితంలో వన్ ఆఫ్ ది మోస్ట్ షాకింగ్ సంఘటన ఇది. ముఖ్యంగా ఫ్రంక్‌ఫర్ట్‌లోని మా ఇంటికి వెలుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఘటన నా జీవితంలో ఇదివరకెన్నడూ చోటు చేసుకోలేదు' అని ఎవలీన్ శర్మ మీడియాకు చెప్పింది.  ఎవలీన్ శర్మ సన్నిహితుల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆమెను కొందరు కుర్రాళ్లు వెంటపడి ఫోటోగ్రాఫ్స్ తీస్తూ వెంటబడ్డారని, ఆమె అభ్యంతరం చెప్పడంతో బూతులు మాట్లాడుతూ వేధించారని తెలుస్తోంది. అయితే వారంతా ఇండియాకు చెందిన వారు అని ఎవలీన్ శర్మ అంటోంది. ఆమె తల్లిదండ్రుల్లో ఒకరు జన్మనీ, ఒకరు ఇండియాకు చెందిన వారు అవ్వడం విశేషం.  బాలీవుడ్ చిత్రాలైన సిడ్నీ విత్ లవ్, యే జవానీ హై దివానీ, ఇష్క్, యారియాన్, మే తేరా హీరో చిత్రాల్లో ఈమె నటించింది. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకోవాలని ఈమె తెగ తాపత్రయ పడుతోంది. మన హీరోయిన్స్ కు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండటంతో మన బ్యూటీలకు ఎక్కడకు వెళ్ళినా సమస్యలు తప్పడం లేదు అనుకోవాలి.
 
Top