ఎన్నికలలో పోటీ చేయని పవన్ కళ్యాణ్ ఎమ్ఎల్ఎ ఎలా అవుతాడు అని ఎవరికైనా సందేహం వస్తుంది. కానీ పవన్ సినిమా తెరపై ఎమ్ఎల్ఎ గా కనిపించబోతున్నాడు. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గబ్బర్ సింగ్-2’ లో పోలీసు అవతారం వదిలి ఎమ్ఎల్ఎ గా కనిపిస్తాడట. దీనికోసం ఈ సినిమా స్క్రిప్ట్ లో చాల మార్పులు చేయబోతున్నారట.  ఈ సినిమాలో కుర్తా, పైజమా తో గడ్డం పెంచుకున్న రాజకీయ వేత్తగా పవన్ కనిపించాలని అనుకుంటున్నట్లు టాక్. ఈ సినిమా ద్వారా ఒక నిజయితీగల ప్రజా ప్రతినిధి ఎలా ఉండాలో తన అభిమానులకు చూపించాలని పవన్ ఉద్దేశ్యం అని అంటున్నారు. అందువల్ల పవన్ ‘గబ్బర్ సింగ్-2’ అవతారం పూర్తిగా మారిపోతోంది అనే వార్తలు విశ్వసనీయంగా బయటకు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ ‘ఓమై గాడ్’ కు లైన్ క్లియర్ చేయడంతో ఈ నెలాఖరు నుండి కాని లేదంటే జూన్ మొదటి వారం నుండి కాని పవన్ వెంకటేష్ ల పై సన్నివేశాల చిత్రీకరణకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి అని అంటున్నారు. దీనికోసం హైదరాబాద్‌లో రామానాయుడు స్టుడియోలో ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారట. అందులోనే ఎక్కువ భాగం ఈ సినిమా సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు అని అంటున్నారు. ఆ సెట్ ఓ మార్కెట్ సెట్. కథలో ఎక్కువ భాగం మార్కెట్ లో జరుగుతుంది కాబట్టి ఆ మార్కెట్ నే బాగా డిజైన్ చేస్తున్నారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వాలు కూడ ఆ సమయానికి ఏర్పడతాయి కాబట్టి ఇక పవన్ సినిమాల హంగామా మొదలవుతుంది అనుకోవాలి. 
 
Top