టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ కుటుంబానికి రజని ‘విక్రమ సింహ’ విడుదల
మరోసారి వాయిదా పడటం అదృష్టం గా మారింది. ప్రస్తుతం చిన్న సినిమాలకు
థియేటర్స్ దొరికేతే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లుగా ఆనంద పడి
పోతున్నారు ఆ సినిమాలో నటించిన హీరోలు మరియు దర్శక నిర్మాతలు.
ఇక లేటెస్ట్ గా రేపు విడుదల కావలసిన రజినీ ‘విక్రమ సింహ’ వాయిదా పడిన సంగతి
తెలిసిందే. ఈ వార్త రజినీకాంత్ అభిమానులకు నిరాశగా మారితే సాయి కుమార్ కు
మటుకు మంచి జోష్ ను ఇచ్చింది. దీనికి కారణం సాయి కుమార్ కొడుకు ఆది నటించిన
'ప్యార్‌మే పడిపోయానే' సినిమాకు ధియేటర్ల సమస్య తీరి విడుదలకు లైన్
క్లియర్ అయింది. విక్రమ్ సింహా కోసం కేటాయించిన థియోటర్లలో ఆది సినిమా
వచ్చేస్తోంది.
ఆది, శాన్వి జంటగా నటించిన చిత్రం 'ప్యార్‌మే పడిపోయానే'. రవి చావలి
దర్శకుడు. ఈ సినిమాను అన్నీ కుదిరితే ఈనెల 16న ఈ చిత్రాన్ని విడుదల
చేద్దామనుకొన్నారు. కానీ ఓ వారం ముందుగా అంటే ఈనెల 10నే ఈ చిత్రాన్ని
విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ సూపర్ స్టార్ కాకముందు వచ్చిన సినిమాలకు
సాయి కుమార్ డబ్బింగ్ చెప్పాడు. రజినీ సూపర్ స్టార్ అయిపోయిన తరువాత మాత్రం
సాయి కుమార్ స్థానాన్ని గాయకుడు మనో పూరించాడు. ఏమైతేనేమి ఈనాడుసాయికుమార్
కు ప్రతిఫలం వచ్చింది అనుకోవాలి.
తన కుమారుడు ఆది కెరియర్ గురించి బెంగ పెట్టుకుంటున్న సాయి కుమార్ కు
అనుకోకుండా కలిసి వచ్చిన ఈ అవకాశం ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.