బాలీవుడ్ హాట్  హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల జిక్యూ అనే మేగజైన్ కోసం ఇచ్చిన హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్ సంచలనంగా మారడమే కాకుండా ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బికినీలో రెచ్చిపోయిన కంగనా రనౌత్‌పై ముంబైలోని మహిళా సంఘాలు భగ్గుమన్నాయి అనే వార్తలు వస్తున్నాయి . అంతే కాదు కంగనాను తన పద్దతి మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఫోటో షూట్లో కంగనా కేవలం బికినీ వేసి సెక్సీగా అందాలు ఆరబోయడమే కాకుండా....మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో కంగనా రనౌత్ తీరు మహిళా సంఘాలకు కోపం తెప్పించింది అని టాక్ .  అంతే కాదు భారతీయ మహిళల గౌరవానికి మచ్చ తెచ్చే విధంగా ఆమె ప్రవర్తన ఉందని మండి పడుతున్నారు. ఈ మేరకు మహిళా సంఘాల నుండి కంగనాకు నోటీసు జారీ అయింది. ‘సమాజాన్ని చెడగొట్టొద్దు. భారతీయ సంస్కృతిని అగౌరవ పరచొద్దు. డబ్బు కోసం ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడవద్దు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే కోర్టుకు వెళ్లడానికి కూడా వెకడబోం' అంటూ హెచ్చరించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరుగాంచిన కంగన గతంలో ఇంత ఘోరమైన ఫోటో షూట్ లో నటించిన సందర్భాలు లేవని బాలీవుడ్ మీడియా రాతలు రాస్తోంది.  
 
Top