సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ గా ట్విట్టర్ లో కి అడుగు పెట్టడమే
కాకుండా, ట్టిట్టర్ లోకి జాయిన్ అయిన కొద్ది గంటల్లోనే దాదాపు లక్ష యాభై
వేల మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇదీ రజనీకాంత్ స్టామినా
అంటూ కోలీవుడ్ అంటుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్ హైటెక్ టెక్నాలజీకు ఆసక్తి
చూపుతున్నాడు కాబట్టి, తన ట్టిట్టర్ ఎకౌంట్ నుండి కమర్షియల్ యాడ్స్ ను
ప్రమోట్ చేయటానికి ట్విట్టర్ ప్లాన్ చేసింది. ఇండియన్ మార్కెట్ కు
సంబంధించిన బ్రాండ్స్ ను రజనీకాంత్ ట్విట్టర్ నుండి ప్రమోట్ చేయటానికి
రజనీకాంత్ పర్మిషన్ కొరకు ట్విట్టర్ ప్రపోజల్ ను పెట్టింది.
దీనికి సంబంధించిన డిటైల్స్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు
అందిస్తుంది. ట్టిట్టర్ మార్కెటింగ్ విభాగం నుండి వచ్చిన ఈ ప్రపోజల్ ను
విన్న రజనీకాంత్, దానిని రిజెక్ట్ చేశాడు. ఇది కేవలం అభిమానుల కోసమే కాని,
నా అకౌంట్ ను చూడటానికి వచ్చిన అభిమానులకు నేనుఎటువంటి యాడ్స్ ను ప్రమోట్
చేయను అంటూ తేల్చి చెప్పాడట. అయితే ట్విట్టర్ గత కొంత కాలంగా సెలబ్రిటి
ఎకౌంట్స్ లో కమర్షియల్ ప్రమోషనల్ యాడ్స్ ను పెట్టించటానికి అభిప్రాయ సేకరణ
చేపడుతుంది.
అందులో భాగంగానే రజనీకాంత్ ను సైతం ట్విట్టర్ అప్రోచ్ అయింది. ఒక వేళ
రజనీకాంత్ అందుకు ఒప్పుకుంటే సంవత్సరానికి పదిహేను కోట్ల రూపాలయను
చెల్లించటానికి సంస్థ రెడీగా ఉన్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన
అగ్రిమెంట్ డిటైల్స్ వివరాలు ఇప్పుడు బటయకు వచ్చాయి. రజనీకాంత్ ట్విట్టర్
ఒపెన్ చేసి రెండు రోజులు కాకుండా, తన ట్విట్టర్ అకౌంట్ కు ఇంతటి భారీ
డిమాండ్ ఉందా? అని రజనీ సైతం ఆశ్ఛర్యపడుతున్నాడంట. ఇది సూపర్ స్టార్ రేంజ్
అని రజనీకాంత్ అభిమానుల స్పంధన.