టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే తెరకెక్కబోతుంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న అప్ కమింగ్ ప్రాజక్ట్ లో హీరోలుగా మహేష్ బాబు, నాగార్జున నటిస్తున్నారు. మొత్తం నాలుగు ప్రధాన పాత్రలతో ఈ మూవీ తెరకెక్కుతుందని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. ఇదిలా ఉంటే రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ వచ్చిన వార్తలను సుహాసిని కొట్టిపారేసింది . దీంతో మణిరత్నం మల్టీస్టారర్ ప్రాజెక్ట్ సెట్స్ దిశగా వెళుతుందనే క్లారిటి వచ్చేసింది. అయితే ఈ మూవీలో మణిరత్నం ఓ స్పెషల్ సాంగ్ కోసం సన్నీలియోన్ ను సంప్రదించినట్టు, అందుకు సన్నీలియోన్ ఒప్పుకున్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. ఆ స్పెషల్ సాంగ్ లో సన్నీలియోన్, నాగార్జున, మహేష్ బాబు ల మీద చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. మణిరత్నం మూవీకు నేషనల్ మార్కెట్ ఉంది కాబట్టి, తన మూవీకు బిజినెస్ కోసం ఈ విధమైన ప్లానింగ్స్ వేస్తున్నట్లు కోలీవుడ్ కథనం. మొత్తానికి ఇది నిజమైతే టాలీవుడ్ లో సన్నిలియోన్ హావా కొనసాగటం ఖాయం అని అంటున్నారు. సన్నిలియోన్ తో మహేష్ బాబు, నాగార్జున చిందులేయం ఖాయమా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.
 
Top