పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్ తోపాటు మూవీలను చేసుకుంటూ
ముందుకు వెళ్ళాలని నిర్ణయించకున్నాడు. అయితే గతంలో పవణ్ కళ్యాణ్ సైన్ చేసిన
రెండు మూవీలు ఇప్పుడు షూటింగ్ దశగా ముందు వెళ్ళటానికి సిద్ధపడుతున్నాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మొదటగా ఓమైగాడ్ మూవీ రిమేక్ లో పార్టిసిపెట్
చేస్తున్నట్టు సమాచారం.
హిందీలో హిట్టయిన 'ఓ మై గాడ్' చిత్రం తెలుగు రీమేక్ లో వెంకటేష్, పవన్
నటిస్తున్నట్టు గతంలో మనకు తెలిసిన విషయమే. ఇందులో పవన్ కల్యాణ్ కృష్ణుడిగా
గెస్ట్ పాత్రను పోషించనున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ మే నెల నుండి
స్టార్ట్ అవుతుంది. చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం మేరకు, పవన్ కళ్యాణ్
కి కృష్ణుడి గెటప్ ను రెడీ చేశారని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ పై ఓ ఫోటో షూట్ నిర్వహించేందుకు పవన్ డేట్స్ ను చిత్ర యూనిట్
అడిగినట్టు టాలవుడ్ టాక్. మొత్తంగా పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు, ఇటు
మూవీలను కూడ బ్యాలెన్స్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. వెంకటేష్ ప్రస్తుతం
'దృశ్యం' రీమేక్ లో నటిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ కి కృష్ణుడి గెటప్ ఎలా ఉంటుంది? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను
ఇక్కడ పోస్ట్ చేయండి.