నందమూరి సింహo బాలయ్య రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటు తన ‘లెజెండ్’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో తెలంగాణ ప్రాంతంలో కూడా తన జైత్రయాత్రను కొనసాగించి ఆ తరువాత ఎన్నికల రణరంగంలో దిగుతానని బాలకృష్ణ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు ఎన్నికల తరువాత బాలకృష్ణ నటించబోయే సినిమా విషయంలో కూడ బాలయ్య ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది.  బాలయ్యతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకుల పేర్లు వినిపించినా బాలయ్య మనసు మాత్రం ఒక యువ దర్శకుడు పై ఉంది అని అంటున్నారు. 'భీమిలీ కబడ్డీ జట్టు', 'ఎస్ఎంఎస్', 'శంకర' వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు తాతినేని సత్య చెప్పిన కధ బాలకృష్ణకు విపరీతంగా నచ్చింది అని అంటున్నారు.  వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఓ స్టోరీ లైన్ ను బాలయ్యకు దర్శకుడు సత్యా చెప్పాడని ఆ కథకు బాలయ్య చాలా ఇంప్రెస్ అయ్యాడని టాక్. అయితే కథను ఇష్టపడిన బాలయ్య పూర్తి స్క్రిప్టుతో వస్తే తన నిర్ణయం చెబుతానని చెప్పాడట. సత్య మాత్రం బాలయ్యకు స్క్రిప్ట్ కూడా నచ్చుతుందని ఇది ఓ వాస్తవ సంఘటనలతో రూపొందగా కేవలం బాలయ్య మాత్రమే ఈ సినిమాకు నప్పుతారని మరొకరు అయితే ఇది రక్తి కట్టదని బాలయ్య సన్నిహితుల వద్ద చెబుతున్నాడట. మరి సత్య ఆశలు ఎంతవరకు తీరుతాయో చూడాలి. ఈరోజు విడుదల అవుతున్న మోహన్ బాబు ‘రౌడీ’ సినిమాకు పాజిటివ్ టాక్ రాకుండా ఉంటే మరో వారంరోజులు ‘లెజెండ్’ కు ఎదురులేదు.
 
Top