కొన్ని విషయాలు వాస్తవంగా యధార్ధాలు అయినా అవి నమ్మడం చాల కష్టం. భారతదేశ ప్రజలకు క్రికెట్ దేవుడిగా కోటాను కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ జీవిత భాగస్వామి అంజలి గురించి ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి. క్రికెట్ బ్యాట్ పుచ్చుకుని ఏ షాట్ ఎలా కొట్టాలో అని ఆలోచిస్తూ మైదానంలో చెలరేగిపోయే సచిన్ కు ఏ సందర్భానికి ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదట. అయితే సచిన్ కు ఎకలర్ డ్రస్ నప్పుతుందో ఏ పూటకు ఏ ఆహరం తీసుకోవాలో ఇలా ప్రతి విషయంలోను సచిన్ గురించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అంజలి అని చాలామందికి తెలియదు. అంతేకాదు సచిన్ లోని ప్రతి మంచి గుణం వెనుక అంజలి ప్రభావం ఉంది అని అంటారు. సచిన్ భార్య ప్రభావం వల్ల సచిన్ కు ఆధ్యాత్మికత పై ఆ శక్తి పెంచుకున్నాడు అని అంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం సచిన్ అంజలి దగ్గర నుంచి నేర్చుకున్నాడట. అంతేకాదు అంజలి సచిన్ కు భగవంతుడు ఇచ్చిన వాటిని గురించే కాకుండా ఇవ్వని వాటి గురించి కూడ కృతజ్ఞతలు చెప్పుకోమని ప్రోత్సహిస్తుంద ట. ధియేటర్లలో జనo మధ్య సినిమా చూడాలని సచిన్ భార్యకు కోరిక ఉన్నా ఇంటర్వెల్లో జనం గుమిగూడిపోవడంతో ఈమె కోరిక చాల అరుదుగా కాని తీరలేదని బాధ పడుతుంది అంజలి. సేలెబ్రేటి భార్యగా తన వ్యక్తిగత జీవితాన్ని చాల పోగొట్టుకున్నా త్యాగం లోనే భాద్యత ఉంది అన్న సిద్దాంతం అంజలిది. ఇంట్లోని ప్రతి వస్తువు ఒక క్రమ పద్దతిలో ఉండాలి అని కోరుకునే అంజలి మాటలు సచిన్ పాటించ కుండా చిందరవందగా వస్తువులు అన్నీ సచిన్ పాడిస్తూ ఉండటంతో వీరిద్దరూ తరుచు గొడవ పడుతూనే ఉంటారట. సచిన్ ఒత్తిడిలో ఉన్నప్పుడు లతామంగేష్కర్ పాటలు పెట్టి సచిన్ ఒత్తిడిని కోపాన్ని తగ్గిస్తుందట అంజలి. చివరగా అoజలి లేకుంటే తాను క్రికెట్ లో ఇన్ని విజయాలు సాదించలేనేమో అనే స్థాయిలో సచిన్ ఆరాధించే గడసరి భార్య అంజలి అని అంటారు. అంతేకాకుండా ఎవరు సహాయం గురించి సచిన్ ఇంటికి వచ్చినా లేదనుకుండా సహాయం చేయమని సచిన్ కు అంజలి ఎప్పుడూ చెపుతూ ఉంటుందట. అయితే వరస పెట్టి సిక్సర్లు, ఫోర్లు కొట్టగలిగిన సచిన్ కు అమజలికి కోపం వస్తే మటుకు చిన్న పిల్లవాడిలా భయపడి పోతాడట మన లిటిల్ మాస్టర్ ఇది నమ్మలేని నిజం.
 
Top