టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రలో వరుస మూవీలు చేసుకుంటూ వస్తున్న జగపతి బాబు, తన మనస్సులోని మాటను బయటకు చెప్పేశాడు. లెజెండ్ మూవీ సక్సెస్ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అభిమానులకు చెప్పుకొచ్చాడు. ఉగాది పండుగ సందర్భంగా లెజెండ్ టీం, ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో జగపతి బాబు సంచలన వాక్యలు చేశాడు. లెజెండ్ గురించి యాంకర్ జగపతి బాబు ప్రశ్నించగా, ‘తనకు లెజెండ్ మూవీ చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ముఖ్యంగా ఇది బాలక్రిష్ణ మూవీ అయినప్పటికీ, నా మూవీ గానే ఇప్పుటికీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా నేను హిట్ అనే మాట వినలేదు. లెజెండ్ మూవీ రిలీజ్ తరువాత నాకు ఎంతో మంది ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అంటూ విశెష్ చెబుతున్నారు. నాకు చాల హ్యాపీగా ఉందంటూ’ చెప్పేశాడు. అయితే టాలీవుడ్ లో స్టార్ డం పొజిషన్ లో ఉన్న హీరో తనకు హిట్స్ కరువయ్యాయి అని ఒప్పుకోవడం కూడ ఆ షో చూస్తున్న అభిమానులకు జగపతిబాబు చేసిన కామెంట్స్ గుండెకు హత్తుకున్నాయని అంటున్నారు. మొత్తంగా జగపతి బాబుకి ఈ మూవీతో భారీగానే ఆఫర్స్ వస్తున్నాయని వినికిడి. మరోసారి బాలక్రిష్ణ మూవీలో జగపతి బాబు నటిస్తాడా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను పోస్ట్ చేయండి.
 
Top