యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్
కమింగ్ మూవీ రభస లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ లో
వినిపిస్తున్న ఆ సమాచారాన్ని ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు
అందిస్తుంది. రభస మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంతంగా, పూర్తి నిడివి ఉన్న
పాటను పాడే అవకాశం ఉందంటున్నారు. ఓ స్పెషల్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్
ఎన్టీయార్ కోసం డిజైన్ చేశాడు.
అందుకోసమే ఆ సాంగ్ ను ఎన్టీఆర్ చేత పాటించాలని డైరెక్టర్, మ్యూజిక్
డైరెక్టర్ ఇద్దరూ ఎన్టీఆర్ ను ఒప్పించే పనిలో ఉన్నారు. ఇదే జరిగితే రభస
మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మూవీకు
సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యంగ్ టైగర్ రభస మూవీపై చాలా
ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది.
మొత్తానికి రభస మూవీలో యంగ్ టైగర్ సాంగ్ పాడుతున్నాడు అంటే నందమూరి
అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన సమంత మూడోసారి
హీరోయిన్ గా నటిస్తుంది.
యంగ్ టైగర్ పాట పాడితే ప్రొఫిషినల్ గా ఉంటుందా? ఉండదా? ఈ టాపిక్ పై మీ
కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.