మీరు వర్ణ సినిమా చూసారా ?ఈమద్య అనుష్క గ్లామర్ తగ్గిందా ? చూస్తుంటే అవుననిపిస్తుంది .. యోగా ఫిగర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క లో వయసు మేముదరుతున్న కొద్ది అందాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఆమె అందాలకు కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వలనే అనుష్క అందాలకు మెరుపు తగ్గిందని ఆమె అభిమానులు అంటున్నారు. నిజానికి ఈ కామెంట్స్ వర్ణ రిలీజ్ త‌రువాత నుండే ఊపందుకున్నాయి.అలాగే సింగం ఫ‌స్ట్ పార్ట్ లో త‌న అందంతో సింగాన్ని సైతం శివాలెత్తించిన అనుష్క సింగం2లో మాత్రం అంద‌రినీ డిస్సాపాయింట్ చేసింద‌ని , మునుప‌టి అనుష్కకు ఇప్పటి బొమ్మాళికి పోలికే లేదని, ముఖం క‌ళ త‌ప్పి కాస్త ఉబ్బింది అని కొద్ది మంది అంటున్నారు.అయితే యోగాతో మెరిసిపోయే మేని సొంతం చేసుకున్న అనుష్క పై జ‌నాలు చేస్తోన్న కామెంట్స్ కి మీనింగ్ వున్నప్పటికీ ప్రస్తుతం అనుష్క న‌టిస్తున్న రాజ‌మౌళి ప్రస్టేజియ‌స్ ప్రాజెక్ట్ భాహుబ‌లి, గుణ‌శేఖ‌ర్ ఫిల్మ్ రాణీ రుద్రమ‌దేవి సినిమాల వ‌ల్లే అనుష్క ముఖంలో క‌ళ త‌ప్పింద‌ని మ‌రికొద్దిమంది అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాల కోసం ఈ బెంగుళూరు భామ క‌త్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకుంది.రాత్రి పగలు అలుపు లేకుండ షూటింగ్లు లో పాల్గొనటం కొంచం గ్లామర్ దేబ్బ తిన్నట్లు ఉంది .. కోమలంగా వుండే శ‌రీరాన్ని ట్రైనింగ్ లో దాదాపు ఆరు నెల‌లు చెమ‌ట‌లు ప‌ట్టించింది. ఆ కార‌ణంగానే అనుష్కలో మునుప‌టి క‌ళ క‌నిపించ‌డం లేద‌న్నది వాస్తవం ... అనుష్క వయసు 32 దాటింది మరి.
 
Top