గతంలో హీరోయిన్స్ తో హీరోలు లాబీయింగ్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే హీరోయిన్స్
కొరత తక్కువుగా ఉండేది కాబట్టి. కాని ఇప్పుడు పరిస్థితులు వేరు. హీరోలు,
హీరోయిన్స్ రోజు రోజుకి పుట్టుకొస్తున్నప్పటికీ కొంత మందికే క్రేజ్
ఉంటుంది. వారి మధ్యనే మూవీల ఆఫర్స్ చక్కెర్లు కొడుతుంటాయి. ఇదిలా ఉంటే
బిటౌన్ లో ఓ టాప్ హీరోతో లాబీయింగ్ చేసిందని ఓ హీరోయిన్ పై తెగ టాక్స్
వినిపిస్తున్నాయి.
ఆ న్యూస్ వివరాలను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. షారుఖ్
ఖాన్ అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ఫ్యాన్ అనే మూవీలో హీరోయిన్ గా ఎవరు
ఎంపిక చేయాలని నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మూవీకు యష్ రాజ్ సంస్థ
నిర్మాతగా వ్యవహరిస్తుంది. అయితే ప్రొడ్యూజర్స్ పరిణితి చోప్ర, అనుష్క
శర్మలను సెలక్షన్స్ చేయగా, షారుఖ్ ఖాన్ మాత్రం వాణి కపూర్ పేరును నిర్మాతల
ముందు ఉంచాడు.
దీంతో చేసేది లేక, దాదాపు వాణికపూర్ నే ఫైనలైజ్ చేసినట్టు లీకేజీల ద్వార
బయటకు చెప్పించారు నిర్మాతలు. దీనికి కారణం వాణికపూర్ గత ఆరు నెలల నుండి
షారుఖ్ ఖాన్ తో డైలీ టచ్ లో ఉంటుందని, అందుకే షారుఖ్ తో తనకు కావాల్సింది
చేయించుకుందని బిటౌన్ టాక్స్.