అల్లు అర్జున్ ‘రేసు గుర్రం' గా మారి ఈనెల మధ్యలో వస్తున్నాడు అన్న సంగతి
తెలిసిందే. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా పై
వస్తున్న అనేక షాకింగ్ రూమర్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంకా ఈ
సినిమా విడుదల కాకుండానే ఈ చిత్రం పలానా సినిమా నుండి కాపీ కొట్టి తీసారని,
ఓ తమిళ సినిమా నుండి మెయిన్ స్టోరీని పూర్తిగా కాపీ కొట్టారని పుకార్లు
షికార్లు చేస్తున్నాయి.
ఇటీవల ఈచిత్రం ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో ట్రైలర్లోని సీన్లు గతంలో
వచ్చిన సినిమాల్లోని సీన్లు పోలి ఉన్నాయని కొందరు జోరుగా ప్రచారం చేసారు.
అయితే ఇదంతా బన్నీ సినిమాపై కావాలని జరుగుతున్న కుట్రే అని మెగా కుటుంబ
సభ్యులు అంటున్నారు.
ఈ సినిమాపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల పరిశ్రమలో బన్నీ జోరును
తగ్గించాలనే ఉద్దేశంతో ఒక పధకం ప్రకారం ఈ వ్యవహారాన్ని ఒక వర్గం చాల
ప్లాండ్ గా కుట్ర చేస్తోంది అని కొంత మంది వాదన. ఈ మధ్య కాలంలో మెగా
కుటుంబానికి చెందిన హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు కావాలనే ఓ
వర్గo ఇలాంటి పుకార్లను పుట్టిస్తోంది అని అంటున్నారు.
బన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రేసుగుర్రం’ ఈ రూమర్ల మధ్య ఎంత వరకు రేసుల
పందెంలో నిలుస్తుందో చూడాలి.