“లెజెండ్” సినిమా విడుదల కాకముందు ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనాల్
చౌహాన్ పేరు కూడ చాలామందికి తెలియదు. ఈ సినిమా దర్శకుడు బోయపాటి బాలీవుడ్
అంతా తిరిగి తిరిగి ఆమెను పట్టుకున్నాడు. మొదట్లో బాలయ్య పక్కన సోనాల్
హీరోయిన్ ఏమిటి అంటు కామెంట్లు కూడ వినిపించాయి. అయితే సినిమా అంతా తానై
బాలకృష్ణ నడిపించడంతో హీరోయిన్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు.
ఈ సినిమా సూపర్ సక్సస్ సాధించిన తరువాత ఈమెకు టాలీవుడ్ లో కూడ చాల అవకాశాలు
వస్తున్నాయి. లెజెండ్ సక్సస్ మీట్ లో ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన
ఇంటర్వ్యూలో ఈ బాలీవుడ్ బ్యూటీ మాట్లాడుతూ బాలకృష్ణ తో సినిమా ఎలా
ఒప్పుకున్నావు అంటు చాల మంది తనను భయపెట్టారని దీనికి కారణం సెట్స్ పై
బాలకృష్ణ షార్ట్ టెంపర్ తట్టుకోవడం జరిగే పని కాదు అంటు చాలామంది భయ
పెట్టడంతో బాలయ్యతో సినిమా ఎందుకు ఒప్పుకున్నానా అని భయపడ్డానని చెప్పింది ఈ
బ్యూటీ.
ఈ భయంతో షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజులలో బాలకృష్ణకు కనిపించకుండా తాను
దూరంగా కూర్చుంటే బాలయ్య దగ్గరకు పిలిచి జోక్స్ వేసి తన భయాన్ని పోగొట్టాడు
అని చెపుతోంది సోనాల్. ఈ రూమర్స్ వల్లే కాబోలు బాలకృష్ణ తో నటించడానికి
చాలామంది హీరోయిన్స్ భయపడి పోతారు అని అంటారు.
అయినా బాలయ్య సోనాల్ ను దగ్గరకు పిలిచి ఏమి కబుర్లు చెప్పాడు అనే విషయం
ఆమె మీడియాకు చెప్పలేదు.