మెగా పొలిటికల్ స్టార్ చిరంజీవి ఓ టీవీ యాంకర్‌ పై తీవ్ర అసహనానికిలోనై అతడి పై రుసరుసలాడుతు విరుచుకు పడ్డాడు..ఒక ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పిన చిరంజీవి ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పడానికి నిరాకరించడమే కాకుండా తీవ్ర కోపానికి లోనై ఇదే ప్రశ్న ఎన్ని సార్లు అడుగుతారు అంటూ సదరు యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకీ చిరుకి చిర్రెత్తుకొచ్చేలా చేసిన ఆ ప్రశ్న ఏమిటంటే? చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు సంబంధించినది. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ చివరి ప్రశ్నగా శ్రీజను ఇప్పటికీ మీకుటుంబంలో ఎందుకలుపుకోలేకపొతున్నారు అన్న ప్రశ్న వినగానే చిరంజీవి ముఖ కవళికలలో అనేక రంగులు మారిపోయి తన కుటుంబ వ్యవహారాల పై ప్రశ్నలు అవసరమా అంటూ ఎదురు ప్రశ్నలు వేసి ఈ ప్రశ్నను తన ఇంటర్వ్యు నుండి కట్ చేయమని చిరంజీవి ఆ యాంకర్ ను కోరాడు. అంతేకాదు తీవ్ర అసహనంతో ఆ ఇంటర్వ్యూను అక్కడితో ముగించేసాడు మన పొలిటికల్ మెగా స్టార్. రాజకీయాలలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఎదో ఒక కుటుంబ సమస్య చిరంజీవిని వెంటాడుతూనే ఉంది. గత ఎన్నికల సమయంలో చిరంజీవి తన చిన్న కూతురు సమస్యతో తల పట్టుకుంటే ఈసారి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రూపంలో చిరంజీవిని సమస్యలు వెంటాడుతున్నాయి.
 
Top