పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ పత్రికకు, ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన సుధీర్గ ఇంటర్వ్యూలోని అంశాల పై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్ రెడ్డి అయన కుటుంబాన్ని ముఖ్యంగా జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ చేసిన విమర్శలను జగన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగ ఉన్న రోజులలో ఆయనకు సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు తాము తీయబోయే సినిమాలో నటించమని తనను బలవంత పెట్టారని అయితే తనకు ఆ సినిమాలో నటించడం ఇష్టంలేదని చెపితే తరువాత ఈ విషయమై తనకు బెదిరింపులు కూడా వచ్చాయని పవన్ తెలిపాడు.  అయితే ఆ సినిమా నిర్మాతల పేర్లు చెప్పడానికి పవన్ నిరాకరించాడు. ఈ ఇంటర్వ్యూను చూసిన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పవన్ పై ప్రశ్నల వర్షం మొదలు పెట్టారు. ఎటువంటి విషయానైనా ధైర్యంగా ప్రశ్నిస్తాను అని చెప్పే పవన్ తనను బెదిరించిన వ్యక్తుల పేర్లు ఎందుకు చెప్పడం లేదని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.  అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ పరిటాల రవి మధ్య జరిగిన సంఘర్షణకు సంబంధించి వార్తను ప్రచురించిన ఒక ఇంగ్లిష్ పత్రిక ఆఫీసు ముందు అలజడి జరిపి ఆపత్రిక ఎడిటర్ దగ్గర నుండి వాస్తవాలు కావాలి అని డిమ్యాండ్ చేసిన పవన్ ప్రస్తుతం ప్రతి విషయంలోనూ తాను చెపుతున్న విషయాల వెనుక ఉన్న వ్యక్తుల పేర్లు సమయం వచ్చినప్పుడు చెపుతాను అని తప్పించు కోవడం వాస్తవాలను నిజయితీగా ప్రశ్నించే పవన్ లాంటి రాజకీయ వేత్తలకు సరైనదైనా అంటూ చాల చోట్ల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయాలలో ప్రశ్నలు వేయడమే కాదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికైనా తెలిసిందా పవన్ !
 
Top