గోవా బ్యూటీ ఇలియానా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఇలీ బేబి మన తెలుగు హీరోలతో నటించేటప్పుడు ఒక్కటంటే ఒక్క లిప్ లాక్ సీన్ లో కూడ నటించలేదు. అంతేకాదు ముద్దుసీన్‌ అంటేనే పారిపోయేది. పారితోషికం ఎక్కువ ఇస్తాను అన్నా ఆమె పట్టించుకునేది కాదు.  అటువంటి ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో పూర్తిగా మారిపోయింది. రోజంతా అదే పనిగా ఒకే ఒక్క ముద్దు సీన్లలో తెగ నటిస్తూ హడావిడి చేస్తోంది. అంతేకాదు ఇలియానాకు ప్రస్తుతం బాగా నచ్చిన హీరో వరుణ్ ధావన్ తో ముద్దుమీద ముద్దులు పెట్టించుకుంటోంది. తాజాగా ఇలియానా వరుణ్ ధావన్‌తో నటించిన 'మై తేరా హీరో' సినిమాలో విచ్చల‌విడిగా ముద్దులు మీద ముద్దులు పెట్టించుకుంటూ ఆ సినిమా యూనిట్ వారినే ఖంగారు పెడుతోందట. ఒకటి కాదు రెండు కాదు ఇలియానాని ఐదారు చోట్ల వ‌రుణ్ ముద్దులు పెట్టుకున్నాడ‌ట‌. ఒకరోజంతా ముద్దుల సీన్లతోనే షూటింగ్ ముగిసిందంటే ఏ రేంజ్‌లో ఇలియానా ఈ సినిమాలో రెచ్చి పోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ర్టీ అంతటా వీళ్ల ముద్దుల సీన్స్ హాట్ టాపిక్. ఇలియానా పెదాలు కందిపోయేలా వరుణ్ రోజంతా సెట్‌లో ముద్దాడుతూనే వున్నాడంటూ హిందీ పరిశ్రమ కోడై కూస్తోంది. మరి చివరకు ఈ సన్నివేసం సెన్సార్ బారి నుండి తప్పించుకుని ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి. 
 
Top