మన టాప్ హీరోల అభిమానులు తమ అభిమానం హద్దు మీరితే ఏమైనా చేస్తారు అనడానికి గతంలోఅనేక ఉదాహరణలు ఉన్నాయి. బాలకృష్ణ సినిమా కెరియర్ కు మళ్ళీ ఒక భారి టర్నింగ్ ఇచ్చిన ‘లెజెండ్’ సినిమాకు సంభందించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అనంతపురం జిల్లాలో ఉగాది నాడు ఓ సంఘటన చోటుచేసుకుంది.  బాలకృష్ణ నటించిన 'లెజెండ్‌' చిత్రం అక్కడి గుర్నాథ్‌ థియేటర్‌లో చూస్తుండగా బాలయ్య డైలాగ్‌లు ఆయన అభిమానులకు సరిగ్గా విన్పించలేదట, అంతే కాదు బాలయ్య పంచ్‌ డైలాగ్‌లు, రాజకీయనాయకులపై సెటైర్లు సరిగ్గా అర్ధం కాక బుర్ర పట్టుకున్నారట బాలకృష్ణ అభిమానులు. దీనికి కారణం అక్కడి సౌండ్‌ సిస్టమ్‌ సరిగ్గా పనిచేయక పోవడమే. దాంతో ఆక్రోశానికి లోనయిన అభిమానులు లెజెండ్‌ సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ తెరను చించి పారేశారట. గతంలో తమ అబిమాన హీరోల సినిమా నచ్చకపోతే సీట్లు చించడం సంఘటనలు తెలిసినవే. అయితే సినిమా బాగున్నా సినిమా తెరచించడం ఇక్కడ వెరైటీ.  దీనితో యాజమాన్యం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పోలీసు కేసు పెట్టినా ఎవరిపైన అనేది తేలదు గనుక సినిమా థియేటర్‌ను మార్చుకోవాలని పోలీసులు సూచించారట. ఇది ఇలా ఉండగా లెజెండ్ చిత్రం సక్సెస్ యాత్రను బాలయ్య బాలయ్య తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. సక్సస్ అనందంతో లెజెండ్ టీమ్ ముఖ్యంగా బాలయ్య దేవాలయాల్లో పూజలు చేసేస్తున్నాడు బాలయ్య. అదృష్టం ఏమిటో కానీ ఈ సినిమాకు 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 22 కోట్లు వసూళ్ళు వచ్చినట్లు చెపుతున్నారు. ఈ స్పీడ్ ను మరింత కొనసాగించడానికి బాలకృష్ణ ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో మరో యాక్షన్ సినిమాకు ఎన్నికల తరువాత చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగ వార్తలు వస్తున్నాయి.
 
Top