మెగా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం రేసుగుర్రం మూవీను పూర్తిచేసుకొని, అప్ కమింగ్ మూవీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రేసుగుర్రం మూవీ తరువాత అల్లుఅర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన డిటైల్స్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. త్రివిక్రమ్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏప్రిల్ 10వ తారీఖున లాంచనంగా ప్రారంభం కాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇచ్చింది. అయితే జులాయి తరువాత వస్తున్న మూవీ కావడంతో, ఇది జులాయి మూవీకు సీక్వెల్ గా ఉంటుందా? లేక వేరే స్టోరీనా వంటి విషయాలపై ఇంకా క్లారిటి రావల్సి ఉంది. మొత్తానికి త్రివిక్రమ్ మాత్రం వరుసగా మెగా హీరోలతోనే మూవీలను చేస్తూ, ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా క్రేజ్ ను క్రియోట్ చేసుకుంటున్నాడు. అల్లుఅర్జున్ మూవీ తరువాత త్రివిక్రమ్ రామ్ చరణ్ తో పనిచేసినా ఆశ్ఛర్యపడాల్సిన అవసరం లేదని టాలీవుడ్ అంటుంది. త్రివిక్రమ్, అల్లుఅర్జున్ కాంబినేషన్ ఈసారి సక్సెస్ ను సాధిస్తుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.
 
Top