పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాట ఇచ్చాడు. పొలిటికల్ ఎంట్రి తరువాత
ఇప్పటి వరకూ మూవీలకు సంబంధించి ఎటువంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. అయితే
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన ఫిల్మ్ కెరీర్ పై స్పంధించాడు. ఇన నుండి తను
మూవీల్లో నటించబోను అనే వార్తలపై పవన్ కళ్యాణ్ క్లారిటి ఇచ్చాడు. దీనికి
సంబంధించిన న్యూస్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫిల్మ్ కెరీర్ పై స్పంధిస్తూ ‘నేను మూవీల
నుండి పూర్తిగా దూరం కాలేదు. కాకపోతే మూవీలకు ఇప్పటి వరకూ కొంత టైం అంటూ
కేటాయించాను. ఇప్పడు ఆ టైం ను తగ్గించుకొని పనిచేస్తాను. అయితే మరో మూడు
సంవత్సరాల పాటు మూవీలు చేస్తూనే ఉంటాను. తరువాత ఎలా ఉంటుందో అప్పుడు
చూద్ధాం. ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి, వారి సమస్యలపై ఎక్కువుగా ద్రుష్టి
పెట్టాలని’ చెప్పుకొచ్చాడు.
మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇక మూవీల్లో నటించడేమో అని ఫ్యాన్స్ తెగ
బాధపడిపోయారు. పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో అభిమానుల్లోనూ ఆనందం
ఉరకలెత్తుతుతంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించబోతున్న గబ్బర్ సింగ్2 మూవీను
చూడాలని అభిమానులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, మూవీలలో నటిస్తే ఇప్పుడు ఆధరణ ఉంటుందా? ఉండదా? ఈ టాపిక్ పై
మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.