సామాన్యంగా మీడియాకు దూరంగా ఉండే సుహాసిని తన భర్త మణిరత్నం సినిమాల విషయంలో ఈమధ్య అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తోంది. గత సంవత్సరం మణిరత్నం దర్శకత్వం వహించిన ‘కడలి’ సినిమా విషయంలో కూడా సుహాసిని మీడియా ముందు హడావిడి చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మణిరత్నం మహేష్ నాగార్జునలతో తీయ బోతున్న సినిమా గురించి ఈమె అధికారికంగా మీడియాకు క్లారిటీ ఇచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో మహేష్ ఓకే చేసిన సబ్జెక్టు ఓ స్పై థ్రిల్లర్ అని దేశభక్తి అండరకరెంట్ గా ఉంటుందని సుహాసిని సూచన ప్రాయంగ తెలిపింది. అంతే కాకుండా ఇప్పటివరకూ ఇండియన్ తెరపై కనిపించని విజువల్స్ ఈ సినిమాలో ఉంటాయట. నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైందని సుహాసినీ మణిరత్నం మీడియాకుతెలిపారు. ఇదే సందర్భంలో సుహాసిని మాట్లాడుతూ " బోర్న్ ఐడింటిటీ చిత్రం తరహాలో మా చిత్రం ఓ స్పై థ్రిల్లర్. ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించనున్నాం. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్, శృతి హాసన్ మాత్రమే కాక మరో హీరోయిన్ కి అవకాసం ఉంది. ఆ పాత్రను ఇరానీ లేదా పాకిస్ధానీ నటి అవకాసం ఉంది ," అని చెప్పింది సుహాసిని యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ది కీలకమైన పాత్ర అట. ఈ సినిమాకు నాగార్జున,ఐశ్వర్యారాయ్ ఇప్పటికే సైన్ చేసారని తెలుస్తోంది..అదే విధంగా మహేష్ బాబు కొన్ని సూచనలు చేసాడని,ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నట్లు మీడియా టాక్. మద్రాస్ టాకీస్, వైజయింతీ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో నిర్మాణం అవుతుందని సుహాసిని తెలియచేస్తున్నారు. అయితే ఈ సినిమా యూటివి కొరటాల శివ దర్శకత్వంలో తీస్తున్న సినిమా తో కలిపి సెట్స్ పై కి వెలుతుందా లేకుంటే ఈ సినిమా పూర్తి అయ్యాక ప్రారంభం అవుతుందా అనే విషయం పై రారరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
 
Top