ప్రస్తుతం చిరంజీవి పవన్ ఫీవర్ తో తెగ భయపదిపోతున్నాడు అంటు సెటైర్లు
పడుతున్నాయి. అంతేకాదు కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలిన మెగాస్టార్
కు పవర్ స్టార్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు అని చెప్పడానికి
ప్రస్తుతం చిరంజీవి ప్రవర్తిస్తున్న తీరే నిదర్సనం అని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదని మంచి నేతలను ప్రజలు
ఎన్నుకోవాలని స్వయంగా పవన్ స్టేట్ మెంట్ ఇచ్చినప్పటికీ అదేవిధంగా రామ్ చరణ్
పుట్టినరోజున తమ మద్దతు చిరంజీవికేనంటూ మెగా ఫ్యాన్స్ శపథం చేసినప్పటికీ
చిరుకి మాత్రం జరుగుతున్న సంఘటనలు ఏమి త్రుప్తి కలిగించడం లేదు అనిటాక్.
అంతేకాదు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్‌కు వస్తున్న ఆదరణ
చూసి చిరు బెంబేలెత్తిపోతున్నారని టాక్.
దీనికి నిదర్సనంగా చిరంజీవి నిన్న మధ్యాహ్నం అత్యవసరంగా తన అభిమాన సంఘాల
నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని పాత ప్రజారాజ్యం కార్యాలయంలో
కాంగ్రెస్ పార్టీలో చేరాలని తన అభిమానులను ప్రాధేయపడినట్టు కూడా సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలన్నీ కాంగ్రెస్‌లో సభ్యత్వం నమోదు
చేసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశాడు అని టాక్. ఈ సమావేశానికి మెగాస్టారే
కాకుండా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, వట్టి వసంత కుమార్‌లు కూడా
ఆహ్వానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా
ఉండాలని మరోసారి ఆయన తన అభిమానులను మరీ మరీ కోరినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవి పట్ల ఉన్న అభిమానంతో మెగా ఫ్యాన్స్ లోని చిరంజీవి వర్గం ఈ
సమావేశానికి వచ్చినా చిరంజీవి తమను వెంటనే కాంగ్రెస్ లో చేరి ప్రచారం
చేయాలని చిరంజీవి పెడుతున్న ప్రెషర్ తట్టుకోలేక చాల మంది మెగా ఫ్యాన్స్
చిరంజీవికి పవన్ ఫోబియా మొదలైంది అంటు సెటైర్లు వినిపించాయట.