పవర్ ఫుల్ డైలాగ్స్ చెపుతూ తోడ కోట్టడంలో బాలకృష్ణను మించిన హీరో టాలీవుడ్ లో మరెవ్వరూ లేరు. బాలయ్య వెండి తెర పై అలా రెచ్చిపోయి డైలాగ్స్ చెపుతూ ఉంటే ప్రేక్షకులు ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు బాలకృష్ణను దేవుడిగా ఆరాధిస్తారు. ఒకప్పటి ‘సమరసింహారెడ్డి’ నుండి లేటెస్ట్ ‘లెజెండ్’ సినిమా వరకు బాలయ్య విజయ రహస్యం ఇదే. ఇక బాలయ్య లేటెస్ట్ సినిమా ''లెజెండ్'' లో క్లైమేక్స్ ప్రత్యేకంగా రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ జంపింగ్ రాయళ్ళ పై బాలయ్య చెప్పిన డైలాగులు గురించే ఇప్పుడు ఒక ఆశక్తికర కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ చిత్రం క్లైమాక్స్ లో ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతాడు బాలయ్య. అంతేకాదు వారందరితోనూ మాట్లాడతాడు. పార్టీలు మారతామని అంతా చెబుతారు  అప్పుడు ‘లెజెండ్’ తన దైన స్టైలో స్పందిస్తూ ‘మీ కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం, మీ వ్యాపారాల కోసం ,పార్టీలు మారతారే తప్ప ఏ ఒక్కడైనా ప్రజల కోసం మారతాము అని చెప్పారా? ఇంతకాలం మీకు ఆశ్రయమిచ్చి... అధికారాలు ఇచ్చి... గుర్తింపు ఇచ్చిన పార్టీని వదిలేస్తారా’ అంటూ విరుచుకుపడతాడు బాలయ్య. అయితే ఈ డైలాగులు ప్రతిపక్షాలను ఇరుకున పెడదామని బాలకృష్ణ అనుకుంటే అవి తిరిగి తిరిగి బాలకృష్ణ సొంత పార్టీ తెలుగుదేశానికే చుట్టు కుంటున్నాయని విమర్శకుల వాదన.  ప్రస్తుతం కాంగ్రెస్ లో భవిష్యత్ లేదని వ్యక్తిగత ఎజెండాతో టీడీపీలో చెరుతున్న నేతలకు వర్తించేలా బాలకృష్ణ డైలాగ్స్ ఉన్నాయని సినీ రాజకీయ విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. దీనిని బట్టి బాలకృష్ణ తన సొంత పార్టీ పై తానే సెటైర్లు వేసుకున్నాడా లేదంటే తన బావ చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి పై సెటైర్లు వేసాడా అనే ఆశక్తి కర కోణం పై ఫిలింనగర్ లో ‘లెజెండ్’ డైలాగుల పై చర్చ జరుగుతోంది.
 
Top