నటి ఇలియానా అర్ధరాత్రి వరకు బాలీవుడ్ హీరో తో నైట్ క్లబ్ లో క్లబ్ లో గడి పిందని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఒక నాడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ఇలియానా ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడం తో ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించింది .  ఈమె వరుణ్ ధావన్ సరసన నటించిన మే తేరా హీరో చిత్రం ప్రమోషన్ కోసం బెంగళూరు వచ్చి అక్కడే ఒక నక్షత్ర హోటల్లో బస చేసింది . ఆమెతోపాటు నటుడు వరుణ్ ధావన్ కూడా అదే హోటల్ లో దిగాడు. చిత్ర ప్రచార కార్యక్రమం ముగిసిన తరువాత హోటల్‌కు చేరిన వరుణ్‌ధావన్, ఇలియానా, ఆ వెంటనే నైట్ క్లబ్‌కు వెళ్లారట. అక్కడే అర్ధరాత్రి ఒంటి గంట వరకు వరుణ్ ధావన్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ నానా హడావిడి చేసారట . అయితే అక్కడ వీరి రొమాన్స్ చూసిన వారు విస్మయం చెందారు అని టాక్ . ఇప్పటికే ఇలియానా నటుడు వరుణ్ ధావన్ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని స్త్రీలంటే చాలా గౌరవం అని పొగడ్తలతో ముంచెత్తి, తను పెళ్లి చేసుకుంటే అలాంటి వ్యక్తినే చేసుకుంటానంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేసిన నేపధ్యం లో ఇప్పుడిలా వరుణ్ ధావన్‌తో నైట్ క్లబ్‌ల్లో గడపడంతో వీరి మధ్య మరో డేటింగ్ స్టొరీ మొదలు అయ్యింది అంటూ మీడియా వార్తలు రాస్తోంది . మరి ఈ కొత్త కద ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి .
 
Top