బుల్లితెర నుండి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు హీరోయిన్స్ గా పరిచయం అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బుల్లితెరలో యాంకరింగ్ చేసుకుంటూ, వెండితెరపై వెలిగిపోవాలని చాలా మందికి ఉంటున్నా, అవకాశాలు మాత్రం వీరికి చాలా అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు చటుక్కున పట్టుకుంటే, టాలీవుడ్ లోనూ ఓ వెలుగు వెలగవచ్చు. ఆ విధంగా వచ్చిన వాళ్ళల్లో కలర్ స్వాతి, ఉదయభాను, రేష్మ వంటి వారు ఉన్నారు. అయితే ఇప్పుడు మరో యాంకర్ కు వెండితెర వెల్ కం చెప్పబోతుంది. జబ్భర్ దస్థ్ కామెడీ షా తో పాపులర్ చెందిన అనసూయకు పవన్ కళ్యాణ్ మూవీలో ఆఫర్ వస్తే కొన్ని కారణాలతో వద్దని చెప్పింది. ఇప్పుడు అదే షోను చేస్తున్న మరో యాంకర్ రష్మికు వెండితెర ఆఫర్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరో మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.  యంకర్ రష్మికు వచ్చిన ఈ ఆఫర్, టాలీవుడ్ లోని ఓ మెగా ప్రాడ్యూజర్ ద్వార వచ్చిందంటున్నారు. మొత్తానికి యాంకర్ రష్మికు ఇప్పటికే సిని ఇండస్ట్రీలోని పలువురితో దగ్గరి పరిచయాలే ఉన్నాయే కాబట్టి, ఈ ఆఫర్ కూడ ఆ విధంగానే వచ్చి ఉంటుందని ఇంకొందరి టాక్. యాంకర్ రష్మికు సెకండ్ హీరోయిన్ గా చేస్తే, ప్రేక్షకలు ఏ విధంగా రిసీవ్ చేసకుంటారు? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.
 
Top