ఝుమ్మంది నాదం సినిమాతో యూత్ యదలో ఝుమ్మంటూ మోగిన అందాల తుమ్మెద.... తాప్సీ! చూడగానే తాపం పుట్టించే ఈ టెండర్ బ్యూటీ.... ఇప్పుడు బాలీవుడ్ని టెంప్ట్ చేస్తోంది. సీరియెస్ గా ముంబైలో మకాం వేసి అవకాశాలకి గాలం వేస్తోంది. లేటెస్ట్ గా తాప్సీ వలలో ఓ బి-టౌన్ కిలాడీ పడిపోయాడు! బిటౌన్ టౌన్ క్రేజీ హీరో అక్షయ్ కుమార్ సరసన తాప్సీ నటిస్తుంది. దీనికి సంబంధించి అప్ డేట్స్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. తెలుగులో కెరీయర్ స్టార్ట్ చేసి తమిళ్ కి వెళ్లిన తాప్సీ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్ తరువాత ఈ అందాల రాణి దండయాత్ర హిందీ మీదకి కొనసాగింది. అక్కడా తన సొగసుల కత్తితో రెచ్చిపోయిన తాప్సీ చష్మే బద్దూర్ తో బాక్సులు బద్ధలుకొట్టింది. అలాగే త్వరలో విడుదల కానున్న రన్నింగ్ షాదీ డాట్ కామ్ సినిమాలో తాప్సీ అమిత్ సాద్ అనే యంగ్ హీరో పక్కన నటిస్తోంది. బాలీవుడ్లో తాప్సీ ఇప్పటి దాకా చేసిన సినిమాలు.... ఛష్మే బద్దూర్, రన్నింగ్ షాదీ డాట్ కామ్.... రెండూ చిన్న సినిమాలే అయినా.... ఈ బబ్లీ బ్యూటీ పట్టుదలతో ముంబైలోనే అదృష్టాన్ని వెతుక్కుంది. మొత్తానికి లేటెస్ట్ న్యూస్ ప్రకారం... బాలీవుడ్ కిలాడీ అక్షయ్ ఈ అప్ కమింగ్ బ్యూటీకి ఫ్లాటయ్యాడట. ఆయన నెక్స్ట్ చేయబోతోన్న నీరజ్ పాండే డిరెక్టోరియల్ వెంచర్లో తాప్సీని హీరోయిన్ గా ఓకే చేశాడట! ఇంతకు ముందు నీరజ్,అక్షయ్ ల కాంబినేషన్లో స్పెషల్ చబ్బీస్ అనే సక్సెస్ ఫుల్ సినిమా వచ్చింది. తాప్పీకు అక్షయ్ అవకాశం ఉవ్వటానికి కారణం ఏంటంటే వీరిద్దరూ గత కొంత కాలంగా సీక్రెంట్ డేటింగ్ చేస్తున్నారని బిటౌన్ ఓపెన్ టాక్. అందకే అక్షయ్ మూవీలో తాప్సీకు అవకాశం దక్కిందంటున్నారు.
 
Top