అతనో చాలా సీనియర్ బాలీవుడ్ డైరెక్టర్. ఆయన తీసిన ఎన్నో సినిమాలు క్లాసిక్ మూవీస్ గా నిలిచిపోయాయి.అయితే, ఆయన తాజా చిత్రంలో ఓ ముద్దు సీన్ వుంది! సదరు డైరెక్టర్ చెప్పినట్టు ఎంతో హాయిగా కిస్సింగ్ చేసేసుకున్నారు! బట్ అందరూ ఆశ్చర్యపోయింది ఎక్కడంటే... ఆ సినిమా హీరో, హీరోయిన్స్ తీసుకున్న టేక్స్ దగ్గర! ముప్పై.... అవును అక్షరాలా... ముప్పై సార్లు తప్పుడు ముద్దులు పెట్టుకున్నారట కాంచి సినిమా లీడ్ పెయిర్! కాంచి మూవీ బిహైండ్ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అసలు ముద్దు పెట్టుకోవడమే తప్పని ఫీలయ్యే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యే ఎంగిలి పడటం విషయంలో నియమాలు సడలిస్తున్నారు. అందుకే బాలీవుడ్ సినిమాలు స్లోగా కిస్సులమయం అయిపోతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ కిస్సుల్ని కి్మ్మనకుండా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కాంచి అనే రొమాంటిక్ లవ్ స్టోరీ తీసిన సుభాష్ ఘాయ్ ఓ రేంజ్లో న్యాచురల్ యాక్టింగ్ చేయించాడు తన హీరో , హీరోయిన్స్ చేత! డీప్ ఎమోషన్స్ తో నడిచే సుభాష్ బ్యూటీఫుల్ లవ్ స్టోరి అంటే... రొమాన్స్ కి కొదవే వుండదు. అందుకే, తన కొత్త జంట మిష్తీ , కార్తీక్ లపై ఓ లిప్ లాక్ పిక్చరైజ్ చేద్దామనుకున్నాడు ఘాయ్. కాకపోతే, కొత్త వారు అవ్వటం వల్ల అనుభవం లేకపోవటమో.... కాదంటే ముద్దు సీన్లో తన్మయం పోందటమో... ఏదీ ఏమో కాని... ఈ యంగ్ కపుల్ ముప్పై టేక్ లు తీసుకున్నారట! అంటే... థర్టీ కిసెస్ అన్నమాట!
 
Top