పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలని ఏముంది సహజీవనం చేసి పిల్లలు కనచ్చు కదా
అంటూ వేరే దృష్టిలో ఆలోచించకండి. కానీ ఇది సహజీవనం కూడ కాదు. అదేవిధంగా
అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తి కూడ కాదు. ఆ వ్యక్తి పేరు ఎడ్ హౌబన్ అతడు ఓ
సాదాసీదా టూర్‌గైడ్. నెదర్లాండ్స్ దేశంలోని మాస్ట్రిక్ట్ పట్టణంలో ఉంటాడు.
ఆయనికిప్పుడు 46 సంవత్సరాలు పెళ్లి కాలేదు. ఇప్పటి వరకు ఆయనకు ఏ స్త్రీతోను
సంబంధాలు లేవు. చాలామంది పిల్లల కోసం ఎంతో తాపత్రయ పడుతున్నారని
తెలుసుకున్న ఎడ్ స్పెర్మ్ డోనర్ (వీర్య దాత) అయ్యాడు. ఓ లోకల్ స్పెర్మ్
బ్యాంకుకు ఇతడి వీర్యాన్ని దానం చేస్తే వారు భద్రపరిచి చాలామందికి
అమ్ముకున్నారట. ఇలా ఆయనకు 98 మంది పిల్లలున్న తండ్రయ్యాడు కేవలం 12
సంవత్సరాల్లోనే. అంతేకాదు ఆ పిల్లల అందరి డీఎన్‌ఏ రిపోర్టులు కూడా ఈయన
దగ్గర ఉన్నాయట.
అలాగని ఆయన ఎవరికి పడితే వాళ్లకి వీర్య దానం చేసేయ్యడు. ఆయన వద్దకు
వచ్చేవారు పిల్లల కలగకపోవడానికి దారితీసిన కారణాల హెల్త్ రిపోర్టులు
తేవాలి. అలాగే వారి ఆరోగ్య సంబంధ రిపోర్టులు తీసుకురావాలి అవన్నీ
పరిశీలించిన తర్వాత మాత్రమే తన వీర్య దానానికి అంగీకరిస్తాడట. అయితే
వ్యవహారాలన్నీ అతడు చట్టబద్ధంగా పూర్తిచేస్తాడు. 98వ బేబీ ఫోటోతో పాటు
అందరి ఫొటోలు, వారి వివరాలు, ఆ దంపతులు వివరాలు ఆయన వద్ద ఉంటాయి.
ఎందుకంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఏ న్యాయసమస్యనైనా ఎదుర్కోవాలి కదా అని
అంటున్నాడు. కనీసం తాగుడు అలవాటు కూడా లేని హౌబెన్ స్పెర్మ్ కౌంట్ వంద
మిలియన్లట. మహాభారతంలో ధృతరాష్ట్రుడికి వంద మంది పిల్లలు ఉన్నట్లు కధలలో
చదువు కున్నాం. మరి ఈయన దృతరాష్ట్రుడు రికార్డులను బ్రేక్ చేస్తాడేమో
చూడాలి.