స్నేహం వేరు, రాజకీయం వేరు. రిలేషన్ వేరు, రాజకీయం వేరు. ఇలా ఎన్ని చెప్పుకున్నా ఒక్క రాజకీయాల్లో ఇద్దరి వ్యక్తుల మధ్య స్వభావం మారిపోతుంది. ఎందుకంటే అది రాజకీయం కాబట్టి. ఆ విధంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను చేరుకున్న పవన్ కళ్యాణ్ అంటే యావత్ టాలీవుడ్ సెలబ్రిటిలు తనతో మూవీను తీయటానికి, తన మూవీలో నటించటానికి, తన నోటి నుండి వారి పేరును వినటానికి ఎంతో ఉత్సాహం చూపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఇంత కాలం తనను అభిమానించిన వారే ఇప్పుడు పవన్ పేరు పలకటానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవన్ స్థాపించిన జనసేన పార్టీకు మద్దతుగా ఫిల్మ్ సెలబ్రిటీలు ఎవ్వరూ ముందుకు రావటం లేదు. అంతే కాకుండా పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి మాత్రం నోరు తెరుస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి పంచ్ డైలాగ్ తో కామెంట్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే రాజమౌళి ఉన్నప్పటికే లోక్ సత్తా పార్టికు తన తరుపు నుండి ప్రచారాన్ని వేగవంతం చేశాడు. టెలివిజన్స్ లోనూ రాజమౌళి యాడ్స్ రూపంలో లోక్ సత్తా పార్టీకు ఓటెయ్యండి అని చెబుతూ తనదైన మార్క్ ను చూపిస్తున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, జె.పి తరుపున క్యాంపెన్ చేయకపోవడం అనేది జె.పికు తీరని ఆవేదనగా మిగిలింది. పైకి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ లోపల మాత్రం పవన్ కు కళ్ళు తెరిపించే పని చేయాలని ఉందట. అందుకు రాజమౌళి చేత పవన్ కు కౌంటర్ వేయించాలని చూస్తున్నాడు. అది ఏ రూపంలో అనేది ఇప్పుడు డిస్కషన్. త్వరలోనే రాజమౌళి పక్కా స్కెచ్ తో పవన్ ను టార్గెట్ చేసుకుంటూ ఓ యాడ్ ను కూడ రెడీ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.
 
Top