సాధారణ హోటల్స్ లో అయితే ఒక ప్లేట్ భోజనం ఖరీదు వంద రూపాయల లోపు ఉంటుంది. అదే స్టార్ హోటల్స్ లో అయితే 500 రూపాయల నుండి 1000 రూ.ల లోపు ఉంటుంది. కానీ ఒక ప్లేట్ భోజనం అక్షరాల 1.22 లక్షలు ఉంటుంది అంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజం. స్పెయిన్ దేశంలోని ఇవిత ద్వీపంలో ప్రపంచంలోకెల్లా అత్యంత విలాస వంతమైన హోటల్ ను నిర్మించారు. ఈ హోటల్ మే నెల 18న ప్రారంభం కాబోతోంది ఈ హోటల్ లోని రెస్టా రెంట్లో ప్రపంచంలోని వివిధ దేశాలకు సంభందించిన ప్రముఖమైన 20 రకాల ఆహార పదార్ధాలతో ఈ భోజనం ఉంటుంది. అత్యంత విలాస వంతమైన ఈ రెస్టారెంట్ లోకి  ఒక ట్రిప్పుకు కేవలం 12 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఒకేఒక్క టేబుల్ దగ్గర కూర్చునే వీరందరికీ సర్వ్ చేయడానికి మాత్రం 24 మంది సర్వర్లు ఉంటారు. స్పెయిన్ లో పేరు పొందిన చెఫ్ పాకో రోన్ సెరో ఈ రెస్టారెంట్ రూప కర్త. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్ గా ఇది రికార్డుకెక్కబోతోంది. ఈ హోటల్ పేరు ‘హార్ట్ రాక్’ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంక ప్రారంభంకాని ఈ హోటల్ రెస్టారెంట్ కు సంబంధించిన టేబుల్ రిజర్వేషన్ అప్పుడే ఒక నెలకు పైగా బుకింగ్ జరిగి పోయిందట. ప్రపంచంలో ఇంత ఖరీదైన హోటల్స్ కు వెళ్ళే ధనవంతులు ఉన్నారు కాబట్టే ఇలాంటి హోటల్స్ ఇంకా ఎన్ని వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.  
 
Top