మిస్ రాణీ ముఖర్జీ తన మిస్ స్టేటస్ ని మిస్సైపోయింది! ఇక పై మిస్సెస్ గా ప్రపంచం ముందుకు రానుంది! తన లాంగ్ టైం స్వీట్ హార్ట్ ఆదిత్య చోప్రాని ఓ సింపుల్ అండ్ ప్రైవేట్ మ్యారేజ్ ఫంక్షన్లో మనువాడేసింది. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రాణి ముఖర్జీ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! ఆమె బి-టౌన్ ని కొన్నేళ్ల పాటూ మకుటం లేకుండా పరిపాలించిన అందాల రారాణి. అయితే, ఆమె పెళ్లాడిన ఆదిత్య చోప్రా గురించి మాత్రం స్పెషల్ గా చెప్పుకోవాలి. అసలు జనంలోకి ఎన్నేళ్లు గడిచినా కూడా రానేరాని ఈ మోస్ట్ రిక్లుసివ్ డైరెక్టర్... లేట్ యశ్ చోప్రా పెద్ద కొడుకు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి సినిమా తీశాడు. అంతే కాదు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ కి చైర్మన్ రూపంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు . నిర్మాతగా, రైటర్ గా దర్శకుడిగా ఆదీకి తిరుగులేదు. అలాంటి వాడ్ని చాలా ప్రేమ వ్యవహారం, మీడియా ముందు బుకాయింపుల తరువాత రాణి ఏప్రెల్ 21న పెళ్లాడింది! ఆదిత్య చోప్రా, రాణి ఇద్దరూ కూడా పెద్దగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే వారు కాకపోవటంతో ఎన్నో వార్తలు వచ్చాయి ఇంత కాలం. కాని, ఎట్టకేలకు ఈ ఇద్దరూ ఒక్కటై అన్ని గాసిప్స్ ని అఫీషియల్ చేసేశారు. ఇటలీలో ఈ మిష్టర్ అండ్ మిసెస్ చోప్రాల వివాహం అయ్యి కాగానే.... ఆదిత్య చోప్రా, రాణి చోప్రాల అప్త మిత్రులు శుభాకాంక్షల పర్వం మొదలు పెట్టారు ట్విట్టర్ లో . డైరెక్టర్ కరణ్ జోహర్ తో పాటూ బాలీవుడ్ బాద్షా కూడా బెస్ట్ విషెస్ తెలిపాడు.
 
Top