తమిళ రాజకీయాలపై సినిమాల ప్రభావం ఇప్పటిది కాదు. 1950ల నుంచే తమిళనాట సినిమా, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం కొనసాగుతూ ఉంది. తమిళ ఓటర్లను ప్రభావితం చేయడంలో తమిళ సినీస్టార్లు ఎప్పుడూ ముందే ఉంటారు. అలాంటిది సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక పార్టీకి సానుకూలంగా మాట్లాడితే.. ఏ పార్టీకైనా అది బంపర్ ఆఫరే. తమిళనాడులో తమ పార్టీని గెలిపించుకునే ఉద్దేశ్యంతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రజనీకాంత్ ఇంటికే వెళ్ళి సంచలనం సృష్టించారు. అయితే, మోడీని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన రజనీకాంత్ ‘మోడీ బలమైన నేత మంచి పాలనాదక్షుడు. ఆయన ఆకాంక్ష నెరవేరాలి’ అని చెప్పిన మాటలు మోడీ-రజనీకాంత్ ఫొటోలతో తమిళనాడులో ప్రతిగల్లీగల్లీకి ప్రచార ఆయుధంగా ఉపయోగించుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ రేపు తమిళనాడులో జరగబోతున్న ఎన్నికలలో బిజేపికి రజినీ మాటలు ఓట్లు వేయిస్తాయా అనే చర్చ తమిళనాట అంతా జరుగుతోంది. ఒక్కసారి చెపితే వంద సార్లు చెప్పినట్లే అనే ఈ భాషా మాటల విలువ ఎంతో రాబోయే రోజులలో తేలిపోతుంది. కానీ తమిళనాట జయలలిత విజయం ఖాయం అని వార్తలు వస్తున్న నేపధ్యంలో రజినీ మాటలు కాషాయ కూటమిని రక్షించలేవు అని సర్వేలు చెపుతున్నాయి. ఈ మాటలలో ఏది నిజమవుతుందో భవిష్యత్ నిర్ణయిస్తుంది.
 
Top