తెలుగు సింగర్ సునీత అంటే తెలియని వారు ఉండరు. ఎందుకుంటే ఈ మధ్య కాలంలో సునీత అంతగా ఫేమస్ అయింది. ఇదిలా ఉంటే సింగర్ సునీత మొదటి సారిగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అవుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న అనామిక మూవీలో ఓ ప్రమోషనల్ సాంగ్ కోసం సునీత మీద సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇందులో సునీగా చాలా హాట్ లుక్ లో కనిపించారు. దీనికి సంబంధించిన అప్ డేట్స్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అనామిక మూవీలో హీరోయిన్ నయనతార అయినప్పటికీ, అనామిక మూవీ ప్రమోషన్ కు నయనతార ఏ మాత్రం త సహకరించటం లేదనేది చిత్రయూనిట్ లోనూ బహిరంగంగా వినిపిస్తున్న మాట. అయితే అనామిక మూవీకు ప్రమోషన్ ను ఏవిధంగా చేయాలనే దానిపై దర్శకుడు శేఖర్ కమ్ములకి పెద్ద ప్రశ్నగా మారింది. అందుకే సింగర్ సునీత చేత తన మూవీకు ప్రమోషనల్ సాంగ్ ను షూట్ చేయించాడు. ఇందులో సునీత శారీతో కనిపించినా, హాట్ అప్పీల్ ను కలిగి ఉందని టైలర్ ను చూసిన వారంటున్నారు. నయనతార కంటే సునీతలో మూవీను తీసినా, మూవీకు కొత్తదనం వచ్చేదంటూ అనే వారు కూడ ఉన్నారు. మొత్తానికి సునీత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే తను ఓ మూవీలో లీడ్ రోల్ చేయటానికి సిద్ధంగా ఉందని టాక్స్ వినిపిస్తున్నాయి. అనామిక ప్రమోషనల్ సాంగ్ లో సునీత లుక్స్ పై మీ కామెంట్స్ ను పోస్ట్ చేయండి.
 
Top