కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం మోహన్ బాబు, యమలీల సీక్వెల్ మూవీలో యముడు పాత్రను చేస్తున్నాడు. ఈ తరహా పాత్రలను మోహన్ బాబు ఇప్పటికే రెండు సార్లు చేశాడు. ఒకటి తన మూవీలో అయితే, మరొకటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ మూవీలో. అయితే రెండు మూవీల్లోనూ మోహన్ బాబు యముడు పాత్రలను చక్కగా పోషించాడు. యమలీల మూవీతో మూడు సార్లు యముడు పాత్రలను మోహన్ బాబు చేసినట్టు అవుతుంది. అయితే ఈ మూవీపై మోహన్ బాబు టాలీవుడ్ కు ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. 'ఇక నుండి నేను యముడి పాత్రలను చేయను, ఇదే చివరి మూవీ' అని అన్నాడు. దీంతో మోహన్ బాబు ఇక నుండి యముడి పాత్రలకు స్వస్తి చెప్పినట్టే అని అంటున్నారు. ఇదే విషయాన్ని బ్రహ్మానందం కూడ వివరించాడు. మోహబాబు ఇక యముడి పాత్రలకు దూరంగా ఉంటాడని అన్నాడు. యమలీల మూవీకు యస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వచ్చిన యమలీల మూవీ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ మూవీలో మోహన్ బాబు నటన చాలా అద్భుతంగా ఉండబోతుందని యస్వీ.కృష్ణారెడ్డి వివరించారు. ఈ సీక్వెల్ కూడ బ్లాక్ బస్టర్ మూవీ కావడం ఖాయం అని అంటున్నారు. మొత్తంగా మోహన్ బాబు, యముడి పాత్రలను చేయను అని చెప్పడంతో తన వద్దకు ఆ తరహా స్టోరీలు రావడం అనేవి తగ్గిపోయాయని టాలీవుడ్ టాక్.
 
Top