మహేష్ బాబు ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని సమస్యల మధ్య చిక్కుకున్నాడు అంటు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు సినిమాలకు సంబంధించినవి కాదు. రాబోతున్న ఎన్నికలు మహేష్ కు పెద్ద పరీక్షగా మారబోతున్నాయి. ఎలక్షన్స్ ప్రచారంలో స్టార్స్ క్రేజ్ ని ఉపయోగించుకోవాలని ప్రతీ పార్టీ భావిస్తూంటుంది. దానిలో భాగంగా ఆ స్టార్స్ క్యాంపైన్ కి వస్తారని భావించిన చోట, వారి బంధువులకు ఎన్నికలలో సీట్లు ఇస్తూ ఉంటారు. ఆ తరువాత ఆ బంధువులు తమ చుట్టాలు అయిన స్టార్ సెలెబ్రెటీలను ప్రచారంలోకి దించి ఏదోవిధంగా విజయం సాధించాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇదే సమస్యలో మహేష్ ఇరుక్కున్నాడు. మహేష్ బాబు తండ్రి కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు కి వైయస్సార్పీ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. మరో ప్రక్క మహేష్ బావ గల్లా జయదేవ్ కి తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేస్తున్నాడు. ఆయన ఇప్పటికే మహేష్ తమ క్యాంపైన్ కు వస్తాడని బహిరంగంగానే ప్రకటించాడు. గల్లా జయదేవ్ ప్రచార ర్యాలీలలో మహేష్ ఎక్కడా అంటు అభిమానులు అడగడంతో జయదేవ్ ప్రస్తుతానికి ఇలా చెప్పే తప్పించుకున్నాడు. అదేవిధంగా మహేష్ కు అత్యంత సన్నిహితుడు అయిన బాబాయ్ ఆదిశేషగిరిరావుని కూడ నిర్లక్ష్యం చేసే స్దితిలో మహేష్ లేదు. ఇద్దరూ ఒకే పార్టీ అయితే సమస్య లేకపోయేదనీ దానికి విరుద్దంగా రెండు చోట్ల రెండు పార్టీలకు ఓట్లు వేయమని ఎలా చెప్పాలి అని మహేష్ తల పట్టుకుంటున్నాడని టాక్. ఏమైనా రాబోతున్న ఎన్నికలు రాజకీయ పార్టీలకే కాదు టాలీవుడ్ సెలెబ్రెటీలకు కూడ పరీక్షగా మారాయి.
 
Top