అమితాబ్ బ‌చ్చన్  అప్పట్లో ఎబిసి సంస్థని స్థాపించి తీవ్రమైన న‌ష్టాల్లో కూరుకుపోయారు. ఆయ‌న చేతిలో ఖ‌ర్చుల‌కు కూడా పైస‌ల్లేని ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో కెబిసి (కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి) చేసే అవ‌కాశం ఆయ‌న‌కి వ‌చ్చింది. ఆ షో సూప‌ర్‌హిట్‌. అమితాబ్ బ‌చ్చన్ వాక్చాతుర్యం, షోని కండెక్ట్ చేస్తున్న విధానం చూసి జ‌నాలు రిమోట్‌ని ప‌క్కన‌పెట్టేసి క‌ళ్లప్పగించుకొని చూశారు.  ఆ షోకి దేశ‌విదేశాల్లో అభిమానులు, దీంతో అమితాబ్‌కి క్రేజ్ పెరిగింది. ప్రక‌ట‌న‌ల్లో న‌టించే అవ‌కాశాలు వెల్లువెత్తాయి. మ‌రోప‌క్క కెబిసిని అలా స‌క్సెస్‌ఫుల్‌గా న‌డుపుతున్నందుకుగానూ అమితాబ్‌కి భారీగా పారితోషికం కూడా అందింది. దీంతో ఆయ‌న న‌ష్టాలు, క‌ష్టాలు అన్నీ తొల‌గిపోయాయి. మ‌ళ్లీ పున‌ర్‌వైభ‌వం సాధించాడు. ఆయ‌న ఎదుగుద‌ల వెన‌క కెబిసి ఉంద‌న‌డంలో ఎంత‌మాత్రం అతిశ‌యోక్తి కాదు. తాజాగా ఆ షోని తెలుగులో నాగార్జున నిర్వహించ‌బోతున్నారు. మాటీవీలో జూన్ నుంచి ప్రసారం కాబోతోంది. దీంతో అంతా ఆ షోపైనే దృష్టిపెట్టారు.

నాగార్జున ఎలా ఆక‌ట్టుకొంటాడో, షోని అమితాబ్ బచ్చన్ త‌ర‌హాలో రక్తిక‌ట్టించ‌గ‌ల‌డా లేదా? అంటూ విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ఈ షోకిగానూ మొత్తం 38మంది తార‌ల్ని ప‌రిశీలించార‌ట‌. చివ‌రికి నాగ్‌ని ఎంచుకొన్నార‌ట‌. ఆయ‌న ఈ స్థానాన్ని సంపాదించుకొన్నార‌నీ మాటీవీ చైర్మన్ నిమ్మగ‌డ్డ ప్రసాద్ తెలిపారు. ఈ షోని నిర్వహిస్తున్నందుకుగానూ నాగ్‌కి పారితోషికం కూడా భారీగా ముట్టజెబుతున్నార‌ట‌. మూడు కోట్లు పుచ్చుకొంటున్నట్టు స‌మాచారం. మ‌రి ఒక షోకా?  లేదంటే మొత్తానికా? అన్నది మాత్రం తెలియ‌డం లేదు. అయితే... ఆ వివ‌రాల్ని ప్రక‌టించ‌డానికి మాత్రం నాగ్ ఇష్టప‌డ‌లేదు.
 
Top