అల్లరి నరేష్‌ని కొబ్బరిబొండాంలా తయారు చేసి కామెడీ పండించాలని చూసాడు రవిబాబు. బక్క పలచగా ఉండే నరేష్ మామూలుగా కనిపిస్తేనే తెగ నవ్విస్తాడు. ఇక అతడు లడ్డు బాబు అంటే ఖచ్చితంగా నవ్వుల విందు ఖాయమని జనం అనుకుని ఉండొచ్చు. రవిబాబుకి మంచి సినిమాలు తీస్తాడనే పేరుంది కాబట్టి ఈ కాంబినేషన్‌లో చెత్త సినిమా వస్తుందని ఎవరూ అనుకోరు. అయితే రవిబాబు అప్పుడప్పుడూ భయంకరమైన సినిమాలు కూడా మన మీదకి వదులుతుంటాడు. అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీలాంటి కళాఖండాలు అతడు అందించాడు. అయితే చూస్తూ చూస్తూ అల్లరి నరేష్‌తో బ్యాడ్ సినిమా తీస్తాడని ఎవరు అనుకుంటారు.
రవిబాబు అప్పుడప్పుడూ అదుపు తప్పి తీసే చెత్త సినిమాల్లో లడ్డుబాబు కూడా ఈజీగా చేరిపోతుంది. ఇదొక తల తోక లేని తలకుమాసిన సినిమా. హీరోని లావుగా చూపించేసి అతడిని అందరితో కొట్టించేస్తే పగలబడి నవ్వేస్తారని దర్శకుడు ఆడియన్స్ ఇంటిలిజెన్స్‌ని చిన్నచూపు చూసిన చిత్రమిది. అదేదో వింత దోమ కుడితే నరేష్ లావైపోయాడని స్టార్టింగ్‌లో చెప్తాడు. మళ్లీ ఇంకో సందర్భంలో అతని శరీర తత్వం తేడా అని, కాస్త కొవ్వు పదార్థం తిన్నా కానీ లావైపోతాడని డాక్టర్‌తో చెప్పిస్తాడు. ఈ సినిమాకి కథ అంటూ రాసుకోకుండా తోచింది తీసుకుంటూ పోయారని దీనిని బట్టి అర్థమవుతుంది.
ఒక రోజులో నాలుగు ఉద్యోగాలు చేసేస్తుంటాడు లడ్డుబాబు. ఒకటి కూడా సవ్యంగా చేయకపోయినా కానీ అందరూ అతడిని భరిస్తుంటారు. కానీ తండ్రి మాత్రం కొడుకు ఏమైపోయినా కానీ తాను గోవాలో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. ఈ ఉద్యోగ ప్రహసనాలు, తండ్రీ కొడుకుల పురాణాల మధ్య ఒక చిన్న పిల్లోడు తనతో ఫ్రెండ్‌షిప్ చేయమని లడ్డుబాబుని పీడిస్తుంటాడు. ఎందుకంటే ఆ పిల్లగాడి తండ్రి చనిపోవడంతో లడ్డుబాబుని ఆమె పెళ్లి చేసుకోవాలనేది ఆ పిల్లోడి కల. తన తల్లికి అలాంటి లడ్డుబాబుతో పెళ్లి ఎందుకు జరగాలని అనుకుంటాడో చెప్పరు. టీవీలో కామెడీ ప్రోగ్రామ్‌లకి క్లిప్పింగ్స్ వేసే ముందు కుళ్లు జోకులు వేస్తుంటారు చూసారా... అలాంటి జోకులతో సినిమా తీసేసి నవ్వించేయాలని చూసాడు రవిబాబు.
లడ్డుబాబు ఆది నుంచీ భారంగా నడుస్తుంది. లడ్డుబాబులానే కథనం కూడా కదల్లేక కదల్లేక ముందుకి కదులుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఈ భారం మరింత ఎక్కువ అవుతుంది. అంతవరకు పిచ్చి కామెడీ చేసుకుంటూ కాలక్షేపం చేసిన దర్శకుడు ఆ తర్వాత కథేదో చెప్పాలని చూసాడు. దాంతో తల వాచిపోతుంది. సినిమా ఎప్పుడవుతుందిరా దేవుడా అని ఎదురు చూడడం మినహా చేయగలిగేది ఉండదు. అల్లరి నరేష్ సినిమాలతో కాలక్షేపం అయిపోతుందని వచ్చిన వారు లడ్డుబాబుని చూసి బిక్క చచ్చిపోతారు. ఏసీలో కూర్చున్నామనే రీజన్ ఒకటి తప్పితే లోపలికి వచ్చినరదుకు వారికి దక్కే రిలీఫ్ ఏమీ ఉండదు.
రవిబాబు ఒక్కోసారి తనని తానే కంట్రోల్ చేసుకుంటాడు. అప్పుడు అతడినుంచి మంచి సినిమాలు వస్తాయి. కొన్నిసార్లు సినిమాని మరీ తేలిగ్గా తీసుకుంటాడు. అప్పుడు లడ్డుబాబులు తెరకెక్కుతాయి. తన టీమ్ నుంచి వర్క్ చేయించుకునే విషయంలోను రవిబాబు స్టయిల్ ఇంతే. ఈ సినిమాకి సంబంధించి రవిబాబు ఎవరితోను సరిగా పని చేయించుకోలేదు. టీవీలో వచ్చినా కానీ పూర్తిగా చూడలేని ఈ కామెడీ థియేటర్లలో ఎక్కువ రోజులు ఉండడం కష్టమే.
ఇలాంటి సినిమా కోసం గంటల కొద్దీ మేకప్ వేసుకుని, అతికించిన ఆ పదార్థాల్ని మోసుకుంటూ తిరిగిన అల్లరి నరేష్ ఈ సినిమా కోసమా ఇంత కష్టపడ్డానని అనుకుంటూ నిట్టూర్పులు విడవాల్సిందే. సుడిగాడు తర్వాత తిరగబడ్డ తన సుడి ఇంకా తిరగలేదు. భూమిక బానే చేసింది కానీ మిగతా తారాగణం అంతా రవిబాబు ఆడించినట్టుగా ఆడారు.
అసలే రెండు భారీ సినిమాలు బాగా ఆడుతున్న సమయంలో వచ్చిన లడ్డుబాబు అంతో ఇంతో బాగుంటే తప్ప నిలబడే అవకాశం లేదు. ఇక ఇప్పుడీ గాలి బుడగ పేలిపోవడం మినహా ఊడబొడిచేదేమీ ఉండదు.
రేటింగ్: 2.5/10