బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకున్న హీరోయిన్ ఐశ్వర్యారాయ్. అయితే ఐష్ తల్లిగా మారిన తరువాత ఇప్పటి వరకూ తిరిగి మూవీల్లో నటించలేదు. అయితే రీసెంట్ గా ఐశ్వర్యారామ్ ఓ తమిళ్ మూవీలో నటించటానికి గ్నీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తుండగానే తనకు మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చిందటూ బిటౌన్ లో హాట్ న్యూస్ వినిపించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. 'ఐశ్వర్యా రాయ్' మళ్లీ అమ్మ కాబోతోందని, ఆమె శరీరాకృతి చూస్తే ఆ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఐశ్వర్య పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కూతురు పుట్టిన తర్వాత ఐశ్వర్య సినిమాలేవీ అంగీకరించలేదు. వెండితెరపై ఆమె ఆగమనం కోసం అభిమానులు వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా, ప్రహ్లాద్ కక్కడ్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి ఆమె పచ్చజెండా ఊపారనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం 'ఐష్' గర్భవతి అనే వార్త బాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. తాజాగా ఎన్నికల్లో ఓటు వేయడానికి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తో కలిసి వచ్చినప్పుడు అక్కడ ఐష్ ను చూసిన చాలా మంది ఈ విషయం గురించే మాట్లాడుకున్నారట. అయితే బిగ్ బి కుటుంబ సన్నిహితుల నుండి అందిన సమాచారం మేరకు ఐష్ ప్రెగ్నెంట్ కాదని వారు వివరణ ఇచ్చారు. దీంతో ఐశ్వర్యారామ్ మీద వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిసిపోయింది.
 
Top